ఇప్పుడున్న హీరోల్లో అతన్ని నేను అబ్బాయ్ అని ప్రేమగా పులుస్తా.. ఆసక్తికర విషయం చెప్పిన అన్నపూర్ణమ్మ
తెలుగు ప్రేక్షకులకు సీనియర్ నటి అన్నపూర్ణ సుపరిచితురాలు. గత మూడు నాలుగు దశాబ్దాల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో 700లకు పైగా చిత్రాల్లో నటించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అన్నపూర్ణ. ఎమోషనల్ పాత్రలతోపాటు… కామెడీలోనూ తనదైన ముద్ర వేశారు. తల్లిగా.. బామ్మగా ఎన్నో పాత్రలు చేసిన అన్నపూర్ణ ఇప్పటికీ సినిమాల్లో రాణిస్తున్నారు.

తెలుగు సినీ పరిశ్రమలో తల్లి, అత్త, అమ్మమ్మ వంటి పాత్రలతో ప్రేక్షకులను అలరించిన అలనాటి నటి అన్నపూర్ణ. తన నట జీవితంలోని ఎన్నో ఆసక్తికర విషయాలను, జ్ఞాపకాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌తో తన అనుబంధం గురించి మాట్లాడుతూ, ఆయన కొత్త నటులను ప్రోత్సహించే విధానాన్ని వివరించారు. రామానాయుడు సినిమాలలో 75శాతం పాత నటులు ఉంటే, 25శాతం కొత్తవారికి అవకాశం ఇచ్చేవారని, ఈ విధానం తన కెరీర్‌కు ఎంతో ఉపయోగపడిందని ఆమె గుర్తుచేసుకున్నారు. ముందడుగు చిత్రం తర్వాత మదర్ పాత్రలు ఎక్కువగా పోషించానని తెలిపారు. అలాగే అవుట్‌డోర్ షూటింగ్‌ల గురించి ప్రస్తావిస్తూ.. అప్పట్లో కేరళ కంటే ఊటీలో ఎక్కువ షూటింగ్‌లు జరిగేవని, కృష్ణ గారు హీరోగా ఉన్నంత కాలం వేసవిలో ఊటీయే తమకు గమ్యస్థానమని చెప్పారు. చిరంజీవి సినిమాలకు కూడా ఊటీ ఒక ముఖ్య ప్రదేశంగా ఉండేదని ఆమె వెల్లడించారు. చిరంజీవి మొదటి పాప పుట్టినప్పుడు రెండు రోజులు సెలవు తీసుకుని వెళ్ళివచ్చిన సంఘటనను గుర్తుచేసుకుంటూ, అప్పటికి తాను కూడా కొత్త నటిగా సినీ రంగంలో అడుగుపెడుతున్నానని తెలిపారు. శివుడు శివుడు సినిమా షూటింగ్ సమయంలోనే ఈ ఘటన జరిగిందని, అప్పుడే తాను రక్తసింధూరం చిత్రంలో చిరంజీవి డబుల్ రోల్‌కు తల్లిగా నటించానని, ఆ పాత్ర తనకు చాలా ఇష్టమని చెప్పారు.
ఇదికూడా చదవండి : అమ్మబాబోయ్.. ఇదెక్కడి మార్పు రా మావ..!! ఈ చిన్నది ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్
సినీ పరిశ్రమలోని సహ నటులతో తన సంబంధాలను వివరిస్తూ, చంద్రమోహన్‌ను మరిది అని, సుత్తివేలును బావ అని, సత్యన్నారాయణ గారిని మంచి బావ అని పిలిచేదానినని పేర్కొన్నారు. దివంగత జగ్గయ్య గారిని మావయ్య అని పిలవడం తనకు ఇష్టమని తెలిపారు. మోహన్ బాబు తన కొడుకు లాంటి వాడని, సీనియర్ ఎన్టీఆర్ తమ తాత అని, ప్రస్తుత తరం అల్లు అర్జున్ వంటివారు తమకు మనవళ్ళ లాంటి వారని ఆమె సరదాగా పంచుకున్నారు. అదేవిధంగా అవకాశాల కోసం తాను ఎవరినీ అడగనని అన్నపూర్ణ స్పష్టం చేశారు. చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు కూడా తమకు అవసరమైనప్పుడు గుర్తు చేసుకుంటారని, ఒక పాత్రకు తను సరిపోతే తప్పకుండా పిలుస్తారని నమ్ముతానని ఆమె చెప్పారు.
ఇదికూడా చదవండి :ఆ కళ్లలోనే ఎదో మాయ ఉంది..! ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది పప్పులో కాలేశారు
సీనియర్ నటులైన రావు గోపాల్ రావు, జగ్గయ్య వంటివారితో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. రావు గోపాల్ రావు కోప్పడేవారని విన్నప్పటికీ, తాను ఆయనతో పనిచేసేటప్పుడు అటువంటి అనుభవం ఎదురవలేదని, ఎందుకంటే పెద్దవాళ్ళతో పనిచేసేటప్పుడు తానే అప్రమత్తంగా ఉండేదానినని తెలిపారు. జగ్గయ్య గారు కొత్తగా వచ్చినప్పుడు చిన్న చిన్న లోపాలను, లైటింగ్ వంటి విషయాలను సున్నితంగా చెప్పేవారని గుర్తుచేసుకున్నారు. ఒకసారి చిరంజీవి తనతో “నువ్వు లైట్ చూసుకోవా.? నీడలో నిలబడ్డావు” అని అనగా, తాను సరదాగా “మీరున్నారుగా” అని బదులిచ్చానని అన్నపూర్ణ నవ్వుతూ చెప్పారు. తాను చిరంజీవిని అబ్బాయి అని, కృష్ణ గారిని మాత్రం సార్ అని సంబోధిస్తానని పేర్కొన్నారు. బాలకృష్ణను బాలయ్య బాబు అని పిలుస్తానని, బ్రహ్మంగారి చరిత్ర సినిమాలో తాను ఆయనకు తల్లిగా నటించినప్పటి నుంచి (అప్పుడు ఆయనకు మీసాలు కూడా సరిగా రాలేదని), ఇప్పటికీ తన దృష్టిలో ఆయన అదే చిన్న బాలయ్య బాబే అని ఆప్యాయంగా పంచుకున్నారు. నాగార్జునను కూడా బాబా అని పిలుస్తానని తెలిపారు. పరిశ్రమలో తన ప్రయాణం చాలా సరదాగా సాగిందని, తనను ఎవరూ పెద్దగా బాధపెట్టలేదని అన్నపూర్ణ చెప్పుకొచ్చారు.
ఇదికూడా చదవండి :ఎప్పుడూ లవ్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ మాత్రమే కాదు..! ఒక్కసారి ఈ పాట విను మావ.. ఒళ్లు పులకరించిపోతుంది
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




