మా నాన్నకు ఇద్దరు భార్యలు.. నేను 19ఏళ్లకే పెళ్లి చేసుకున్నా.. వెంటనే తల్లి అయ్యా..
నటి వనితా విజయకుమార్ తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రయాణం, కార్పొరేట్ ఉద్యోగం, బాల్యం, వివాహాలు,అలాగే తల్లిగా తన అనుభవాలను పంచుకున్నారు. ఆమె కుటుంబ మద్దతు లేని కష్టకాలం, ఇద్దరు అమ్మలు పెంచిన ప్రత్యేకమైన బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు.

నటి వనితా విజయకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వృత్తిగత, వ్యక్తిగత జీవితంలోని ఎత్తుపల్లాలను, అంతర్గత భావోద్వేగాలను పంచుకున్నారు. ఆమె తన జీవితాన్ని ఒక పోరాటంగా అభివర్ణిస్తూ, గ్రేస్‌ఫుల్‌గా జీవించానని పేర్కొన్నారు. మహిళగా తన ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నట్లు తెలిపారు. వనిత సినీ పరిశ్రమను వదిలి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పి.వాసు గారి దగ్గర సుమారు పది సినిమాలకు పనిచేశారు. అక్కడ దర్శకురాలిగా, నటిగా, టెక్నీషయన్ గా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, అది తనకు ఒక పెద్ద స్కూల్ లాంటిదని తెలిపారు. సినీ రంగం తర్వాత ఆమె తెర వెనుక అనేక పనులు చేశారు. ఒక ఛానెల్‌లో పనిచేసి, ఆ తర్వాత కంప్యూటర్ గ్రాఫిక్స్ సంస్థ ప్రైమ్ ఫోకస్, ఇండియాస్ నంబర్ వన్ సీజీ అండ్ డీఐ కంపెనీలో సౌత్ ఇండియా మార్కెటింగ్ హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. డీఐ (డిజిటల్ ఇంటర్మీడియట్) టెక్నాలజీని సౌత్ ఇండియాకు పరిచయం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఇది పూర్తి కార్పొరేట్ కెరీర్‌గా పేర్కొంటూ, మీడియా మార్కెటింగ్, బ్రాండింగ్, పీఆర్, ఈవెంట్‌లు వంటి అనేక రంగాలలో పనిచేసిన అనుభవం ఉందని వివరించారు.
ఇది కూడా చదివేసేయండి : అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఒక్క హిట్ కూడా లేదు.. ఇప్పుడు ఇలా
వనిత తన వ్యక్తిగత జీవితంలో ఊహించని మలుపులు ఎదురయ్యాయని తెలిపారు. 18-19 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకున్నానని, ఆ వెంటనే తల్లి అయ్యానని, అప్పట్లో కుటుంబ మద్దతు లేకపోవడం వల్ల చాలా కష్టాలను ఎదుర్కొన్నానని గుర్తుచేసుకున్నారు. తన బాల్యం డిస్టర్బ్‌డ్‌గా ఉందనే భావన తనకు ఎప్పుడూ కలగలేదని పేర్కొన్నారు. ఆమె బాల్యం తన తండ్రి విజయకుమార్ మొదటి భార్య (అరుణ్ వాళ్ళ అమ్మ) అలాగే తన సొంత తల్లితో కలిసి గడిచిందని, వీరిద్దరినీ తాను పెద్ద అమ్మ, అమ్మ అని పిలిచేదానినని చెప్పారు. ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఎటువంటి కలహాలు లేకుండా, ఉత్తమ స్నేహితులు, తోబుట్టువుల్లా జీవించారని, తమ కుటుంబం సంతోషంగా ఉండేదని ఆమె వివరించారు. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేకపోవడం, తన తండ్రి తన ఇద్దరు భార్యలను సమానంగా చూడటం వల్ల ఇతరుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదని స్పష్టం చేశారు.
ఇది కూడా చదివేసేయండి : సూపర్ స్టార్ కృష్ణ కాలర్ పట్టుకున్న హీరో.. కటౌట్లు తగలబెట్టి , థియేటర్లపై దాడి చేసిన అభిమానులు
వనిత తన చిన్నతనంలో కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేనప్పటికీ, పెద్దయ్యాక వివాహాలు, ఇతర సంబంధాల ద్వారా సమస్యలు తలెత్తాయని తెలిపారు. చిన్నతనంలో డిస్టర్బ్డ్‌గా ఉన్నవారు తప్పుడు భాగస్వాములను ఎంచుకుంటారనే వాదనతో ఆమె పూర్తిగా ఏకీభవించలేదు. తన కుటుంబం చాలా ఆర్థడాక్స్ అని, తల్లి చాలా కఠినంగా ఉండేవారని, ఈ కారణంగానే తనకు స్వేచ్ఛ కావాలని కోరుకున్నానని చెప్పారు. 80వ దశకంలో తల్లిదండ్రులు పిల్లలతో అంతగా మాట్లాడేవారు కాదని, అదే తను ఇప్పుడు తల్లిగా తన పిల్లలతో స్నేహితురాలిగా ఉంటూ, అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నానని వివరించారు. గతంలో వివాహాలకు ముందు భాగస్వామిని అర్థం చేసుకునే అవకాశం ఉండేది కాదని, అది తన మొదటి వివాహంలో సమస్యలకు దారితీసిందని పేర్కొన్నారు. జీవితంలో సర్దుబాట్లు, రాజీ పడటం అవసరం కానీ టాక్సిక్ రిలేషన్షిప్స్ మంచిది కాదని, ఈ అవగాహన అప్పట్లో లేదని తెలిపారు. తనలాగే ఎంతో మంది మహిళలు ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారని వనిత విజయకుమార్ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదివేసేయండి : ఆ విలన్ చెప్పే డైలాగ్స్, యాక్షన్ అంటే బాలయ్యకు అంత ఇష్టమా.. సెట్‌లో దగ్గరుండి మరీ చూసేవారట
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




