AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anchor Pradeep: డాక్టర్స్‌ కూడా 50- 50 ఛాన్స్ అన్నారు.. మనసు నిండా అవే ఆలోచనలు.. ప్రదీప్ లైఫ్‌లో ఇంత విషాదముందా?

ఆ మధ్యన కొన్ని రోజుల పాటు ఏ టీవీ షోలనూ కనిపించలేదు యాంకర్ ప్రదీప్ మాచిరాజు. సోషల్ మీడియాలోనూ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో ఈ స్టార్ యాంకర్ కే ఏమైందోనని అభిమానులు తెగ కంగారు పడ్డారు. అయితే దీని వెనక గల ఓ విషాద ఘటనను తాజాగా బయటపెట్టాడు ప్రదీప్.

Anchor Pradeep: డాక్టర్స్‌ కూడా 50- 50 ఛాన్స్ అన్నారు.. మనసు నిండా అవే ఆలోచనలు.. ప్రదీప్ లైఫ్‌లో ఇంత విషాదముందా?
Anchor Pradeep Machiraju
Basha Shek
|

Updated on: Aug 03, 2026 | 8:15 PM

Share

ప్రస్తుతం తెలుగు బుల్లితెరను ఏలుతోన్న టాప్ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు ఒకరు. ముఖ్యంగా సుమ, శ్రీముఖి వంటి ఆడవాళ్ల డామినేషన్ ఉండే ఈ తెలుగు బుల్లితెర రంగంలో ప్రదీప్ తనదైన యాంకరింగ్ తో దూసుకెళ్లుతున్నాడు. తన దైన టైమింగ్, పంచులు, ప్రాసలతో రోజు రోజుకు తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నాడు. ఓవైపు బుల్లితెరపై రాణిస్తూనే మరోవైపు హీరోగా వెండితెరపై అదృష్టం పరీక్షించుకుంటున్నాడు ప్రదీప్ మాచిరాజు. ఇప్పటికే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి వంటి సినిమాల్లో హీరోగా నటించాడు ప్రదీప్. అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. అయినా బుల్లితెరపై ఈ స్టార్ యాంకర్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇదిలా ఉంటే టీవీ షోస్, ప్రోగ్రామ్స్, రియాలిటీ షోస్ తో బిజీ బిజీగా ఉండే ప్రదీప్ ఆ మధ్యన కొన్ని రోజుల పాటు సైలెంట్ అయిపోయాడు. ఏ టీవీ షోలోనూ కనిపించలేదు. కనీసం సోషల్ మీడియాలోనూ ఒక్క పోస్ట్ పెట్టలేదు. దీంతో ప్రదీప్ కు ఏమైందైనని అభిమానులు తెగ కంగారు పడిపోయారు. అయితే తానిలా గ్యాప్ తీసుకోవడానికి గల కారణాలను తాజాగా బయట పెట్టాడు ప్రదీప్. ప్రముఖ ఛానెల్ లో ప్రసారమవుతోన్న ఓ టీవీ షోలో సందడి చేసన ప్రదీప్ తన జీవితంలో జరిగిన అత్యంత విషాదకర సంఘటనను బయట పెట్టాడు.

‘ఒక షూట్‌లో చిన్న యాక్సిడెంట్ వల్ల నాకు లెగ్ సర్జరీ జరిగింది. ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్తున్నప్పుడు డాక్టర్స్ అయితే 50-50 ఛాన్స్ అని చెప్పారు. కంప్లీట్‌గా ఫిట్‌గా నడవగలుగుతానా? లేదా అని బాగా కుమిలిపోయాను. ఆ సమయంలో నా మనసు నిండా ఒకటే ఆలోచనలు. కూర్చొని చేసే పనులు ఏమేం ఉంటాయా? అని తెగ ఆలోచించాను. మరీ ముఖ్యంగా కూర్చొని యాంకరింగ్ చేసేయొచ్చా? లేకపోతే ఇంకేమైనా చేయొచ్చా? అని మనసులో ఆలోచనలు మెదిలాయి. మానిసికంగా బాగా కుమిలిపోయాను. ఫిజికల్‌గా ఎంత లేచి నిలబడి రావాలని అనుకున్నా.. రాలేకపోయాను. నా జీవితంలో అత్యంత గడ్డు పరిస్థితులు ఇవే’ అని తన బాధను గుర్తు చేసుకుంటూ బాగా ఎమోషనల్ అయ్యాడు ప్రదీప్. ఈ మాటలు విన్న అక్కడున్న వారందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రదీప్ కు ధైర్యం చెప్పి ఓదార్చారు.

కాగా ప్రస్తుతం పలు టాప్ టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు ప్రదీప్. కుకు విత్ జాతిరత్నాలు, శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర టీవీ షోలకు హోస్ట్ గా ఉంటున్నాడీ స్టార్ యాంకర్. అయితే హీరోగా ప్రదీప్ మూడో సినిమా చేస్తాడా? లేదా గ్యాప్ తీసుకుంటాడా? అన్నది త్వరలోనే క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us