ఏలూరు ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో ఒక పెద్ద రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. వేగంగా వచ్చిన కంటైనర్ లారీ ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుండి ఢీకొంది. ఈ ఘటనతో బస్సు డివైడర్ దాటి పక్కకు దూసుకెళ్లింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ అక్కడి నుండి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు లారీని పట్టుకున్నారు.