AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Prices: ఊగిసలాడుతున్న వెండి ధరలు.. రాబోయే రోజుల్లో మరింత తగ్గుతాయా..?

బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో కొనసాగుతుండగా.. సిల్వర్ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. గత ఏడాది జనవరిలో వెండి ధరలు రూ.4 లక్షలకు చేరుకుని రికార్డ్ సృష్టించగా.. ఆ తర్వాత నుంచి పడిపోతున్నాయి. ప్రస్తుతం రూ.2.60 లక్షల వద్ద కొనసాగుతుండగా.. గత కొద్ది నెలల వద్ద ఇదే ధర వద్ద ఊగిసలాడుతున్నాయి.

Silver Prices: ఊగిసలాడుతున్న వెండి ధరలు.. రాబోయే రోజుల్లో మరింత తగ్గుతాయా..?
Silver
Venkatrao Lella
|

Updated on: Aug 20, 2026 | 11:38 AM

Share

బంగారం ధరలకు భిన్నంగా వెండి కొనసాగుతోంది. బంగారం ధరలు భారీగా పెరుగుతుండగా.. వెండి ధరలు మాత్రమే స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొంతకాలంగా సిల్వర్ కూడా పెద్దగా మార్పుల్లేవ్. అమెరికన్ డాలర్ గత కొద్ది రోజులుగా నెమ్మదిగా బలహీనపడుతోంది. దీంతో పాటు యూఎస్ బాండ్ల రాబడులు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో పెట్టుబడిదారులు బంగారం వైపు చూస్తుండగా.. వెండికి ఆకర్షణ తగ్గింది. గురువారం ఉదయం మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో సెప్టెంబర్ సిల్వర్ కాంట్రాక్టులు 1.29 శాతం పెరిగి కిలోకు రూ.2,39,850కి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పెరగడంతో దేశీయంగా కూడా దాని ప్రభావం కనిపించింది. దేశీయ ప్యూచర్ మార్కెట్లో కూడా సిల్వర్ ధరలు ఒకేసారి గురువారం రూ.10 వేల మేర పెరిగాయి.

బలహీనపడ్డ డాలర్

అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ద్రవ్య మద్దతు ప్రకటన తర్వాత డాలర్ విలువ దిగజారడం, ప్రభుత్వం బాండ్ల దిగుబడులు తగ్గాయి. దీర్ఘకాలిక నోట్లు, బాండ్ల కోసం ద్రవ్య మద్దతు బైబ్యాక్ కార్యకలాపాల పరిమాణాన్ని రెట్టింపు చేయనున్నట్లు యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ తెలిపింది. దీని ప్రభావంతో రెండు నెలల్లోనే యూఎస్‌లో బంగారం ధరలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. బుధవారం డాలర్ 0.83 శాతం క్షీణించగా.. 10 ఏళ్ల బాండ్ల రాబడులు 1.13 శాతం పడిపోయాయి. ఇక దీంతో పాటు ఆగస్ట్ 19న విడుదలైన యూఎస్ ఫడ్ రిజర్వ్ బ్యాంకు పాలసీ మీటింగ్ మినిట్స్.. పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఆందోళనను వ్యక్తం చేశాయి. వడ్డీ రేట్ల పెంపు అవసరం అవుతుందని ఫెడ్ అంచనా వేసింది. తదుపరి మీటింగ్ సెప్టెంబర్ 15,16వ తేదీల్లో జరగనుండగా.. ఫెడ్ నిర్ణయాలు వెండి ధరలపై ప్రభావితం చూపనున్నాయి.

వెండి ధరల్లో మార్పులు

గత 10 రోజుల్లో వెండి ధరల్లో అస్థిరత కొనసాగుతోంది. ఆగస్ట్ 11న కిలో వెండి రూ.2.60 లక్షల వద్ద ప్రారంభమవ్వగా.. ఆగస్ట్ 13 వరకు అవే ధరలు కొనసాగాయి. ఇక ఆగస్ట్ 15న రూ.5 వేలు తగ్గి రూ.2.55 లక్షలకు చేరుకోగా.. ఆగస్ట్ 18 వరకు అదే ధర కొనసాగించింది. ఆగస్ట్ 19న రూ.5 వేలు తగ్గి రూ.2.50 లక్షలకు చేరుకోగా.. ఆగస్ట్ 22వ తేదీన ఒకేసారి రూ.10 వేలు పెరిగి రూ.2.60 లక్షలకు చేరుకుంది. ధరలు అటుఇటుగా ఒకేచోట కొనసాగుతున్నాయి. కానీ బంగారం ధరలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. గత నెలలో తులం బంగారం ఒక దశలో రూ.1.50 వేల దిగువకు కూడా చేరుకోగా.. ఆగస్ట్ 20 నాటికి రూ.1.60 లక్షలకు పెరిగింది. ఒక్క నెలలోనే బంగారం ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. రాబోయే రోజుల్లో బంగారంతో పాటు వెండి ధరలు ఎలా ఉంటాయనేది చూడాలి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర