AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌… డబుల్ క్లాష్‌ పక్కా..

Samatha J
|

Updated on: Aug 19, 2026 | 4:22 PM

Share

సౌత్ బాక్స్ ఆఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలు రెండు సీజన్లలో తలపడనున్నాయి. దసరాకు జైలర్ 2 వర్సెస్ విశ్వంభర, సంక్రాంతికి మెగా 158 వర్సెస్ ధర్మాన్ చిత్రాలు విడుదల కానున్నాయి. గతంలో జైలర్ విజయంతో, బోళా శంకర్ నిరాశతో ఈసారి పోటీపై ఉత్కంఠ నెలకొంది.

సౌత్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పుడు ఒకే ఒక్క టాపిక్ హాట్ డిబేట్‌గా మారింది: మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ మధ్య జరగబోతున్న వార్. పాన్ ఇండియా ట్రెండ్ నేపథ్యంలో ఈ ఇద్దరు దిగ్గజాలు బ్యాక్ టు బ్యాక్ క్లాష్‌లకు సిద్ధమవుతుండటం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ దసరా పండగకు ఇద్దరు సీనియర్ స్టార్స్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 అక్టోబర్ 15న విడుదల కాగా, ఆ మరుసటి రోజే అక్టోబర్ 16న చిరంజీవి విశ్వంభర ప్రేక్షకుల ముందుకు రానుంది. కేవలం ఒక్క రోజు గ్యాప్‌లో ఈ రెండు భారీ చిత్రాలు విడుదలవుతుండటంతో బాక్స్ ఆఫీస్ హీట్ అప్పుడే మొదలైంది. ఈ క్లాష్ దసరాతోనే ఆగేలా లేదు. సంక్రాంతి సీజన్‌లోనూ మరోసారి తలపడేందుకు సిద్ధమవుతున్నారు. పొంగల్ రేసులో బాబీ దర్శకత్వంలో చిరంజీవి మెగా 158 విడుదల కానుండగా, అదే సమయంలో కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న ధర్మాన్ కూడా డీ కొట్టబోతోంది.

మరిన్ని వీడియోల కోసం :

గ్లోబల్‌ బిజినెస్‌ లెక్కలు మార్చేస్తున్న రామాయణ టీమ్‌

ఫరియా అబ్దుల్లాను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు

ఆగస్టు మీద ఐకాన్‌ స్టార్‌ ఫ్యాన్స్ ఆశలు

అజిత్ సినిమాలో గెస్ట్ రోల్స్‌లో వెంకటేష్‌, మోహన్‌లాల్‌

Follow Us