ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్…
రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. టీజర్లలో అశ్లీలత ఉందని ఆరోపణలు రావడంతో యష్ స్పందించారు. సినిమాలో కనీసం ఒక్క ముద్దు సన్నివేశం కూడా లేదని, ఇది పూర్తిగా జెన్-జీ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన చిత్రమని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26న విడుదల కానుంది.
కేజీఎఫ్ లాంటి భారీ విజయాల తర్వాత రాకింగ్ స్టార్ యష్ నుండి రాబోతున్న చిత్రం టాక్సిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో డ్రగ్ కార్టెల్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం యష్ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నారు. అయితే, ఇటీవల విడుదలైన టీజర్లలో అశ్లీలత ఉందని ఆన్‌లైన్‌లో కొంత వివాదం చెలరేగింది. దీనిపై యష్ స్పందిస్తూ, తాను వల్గారిటీకి పూర్తిగా వ్యతిరేకమని, టాక్సిక్ సినిమాలో కనీసం ఒక్క ముద్దు సన్నివేశం కూడా లేదని షాకింగ్ క్లారిటీ ఇచ్చారు.సినిమాలోని సన్నిహిత సన్నివేశాలను చాలా సౌందర్యాత్మకంగా రూపొందించామని, ఇది పూర్తిగా జెన్-జీ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని తీసిన సినిమా అని యష్ తెలిపారు. యువత, సీనియర్ల మధ్య తరం అంతరం సమస్యలు, పాత నియమాలను బద్దలు కొట్టే ఆలోచనలు వంటి సమకాలీన అంశాలను ఈ చిత్రంలో ప్రస్తావించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
గ్లోబల్ బిజినెస్ లెక్కలు మార్చేస్తున్న రామాయణ టీమ్
ఫరియా అబ్దుల్లాను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్.. హైదరాబాదీ ఆవేదన!
వాష్‌రూమ్‌లో ఊహించని సీన్.. దెబ్బకు కళ్లు బైర్లు
మతిమరుపుతో తప్పిపోయిన వ్యక్తి.. కుటుంబంతో కలిపిన చాట్‌జీపీటీ
స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు..

