AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఎల్లలు దాటిన ప్రేమ.. స్కాటిష్ ఎంపీని పెళ్లాడిన కేరళ మహిళ.. 9 ఏళ్లకు నెరవేరిన కల!

ప్రేమకు హద్దులు ఉండవు, వయస్సు అస్సలే సంబంధం ఉండదని మరో జంట నిరూపించింది. కేరళ రాష్ట్రానికి చెందిన నిధిన్ చంద్ను అనే మహిళ స్కాటిష్ పార్లమెంట్ సభ్యుడైన మార్టిన్ డే అనే వ్యక్తిని త్రిస్సూర్‌లోని ప్రసిద్ధ గురువాయూర్ ఆలయంలో పెళ్లి చేసుకుంది.2016లో మొదలైన వీరి ప్రేమ దాదాపు 10 ఏళ్ల తర్వాత పెళ్లిగా మారింది. ఈ పెళ్లికి సంబంధిచిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Viral News: ఎల్లలు దాటిన ప్రేమ.. స్కాటిష్ ఎంపీని పెళ్లాడిన కేరళ మహిళ.. 9 ఏళ్లకు నెరవేరిన కల!
Martin Day Nidhin Chand Wedding
Anand T
|

Updated on: Aug 20, 2026 | 11:04 AM

Share

కేరళ రాష్ట్రానికి చెందిన ఓ మళయాలి మహిళ యూకే మాజీ ఎంపీ, స్కాటిష్ పార్లమెంట్ సభ్యుడైన మార్టిన్ డే అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు త్రిస్సూర్‌లోని ప్రసిద్ధ గురువాయూర్ ఆలయంలో వీరి పెళ్లి సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ వివాహానికి బంధువులు, సన్నిహితులతో పాటు నిధిన్ చందన్ కుమారుడైన 22 ఏళ్ల వేదిక్ శంకర్ కూడా హాజరయ్యారు. 2016లో మొదలైన వీరికి ప్రేమ సుమారు 10 ఏళ్ల తర్వాత ఖండాలు దాడి పెళ్లి బంధంగా మారడంతో వీళ్ల వివాహానికి సబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. కేరళ రాష్ట్రానికి చెందిన కె.ఎన్. చాందీ, రాజీల ఏకైక కుమార్తె అయిన నిధిన్ చంద్ తన బీటెక్ పూర్తి చేసిన తర్వాత 2008లో ఐటీ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చేయడానికి యూకే వెళ్లారు. కొన్నాళ్ల పాటు అక్కడే ఉన్న నిధిన్ తన పీహెచ్‌డీని కూడా పూర్తి చేసుకుంది. అయితే ఆమె తిరిగి ఇండియాకు రావాలి అనుకున్న సమయంలో యూకేలో వీసా నిబంధనలు మారడంతో ఆమె వీసా రద్దయిపోయింది.ఆ సమయంతో విదేశీ విద్యార్థుల సమస్యలపై ఆమె తన గొంతును గట్టిగా వినిపించింది. ఆ సమయంలో లినలిత్‌గో అండ్ ఈస్ట్ ఫాల్కిర్క్ నియోజకవర్గ ఎంపీగా ఉన్న మార్టిన్ డేతో ఆమెకు పరిచయం ఏర్పడింది.

తొలుత స్నేహితులుగా మొదలైన వీరి పరిచయం కాలక్రమేనా ప్రేమగా మారింది. దీంతో తనను పెళ్లి చేసుకుంటావా అని మార్డీన్ నిధిన్‌ను కోరాడు. అయితే అప్పటికే పెళ్లై విడాకులు తీసుకుని, 12 ఏళ్ల కుమారుడు ఉన్న నిధిన్‌కు తొలుత ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ ఉద్యోగం లేదు, వీసా రద్దయింది, దానికి తోడు మార్డిన్ తన పట్ల ఎంతో ప్రేమతో ఉన్నాడు.. ఇవన్నీ ఆలోచించన తర్వాత నిధిన్ కూడా అందుకు ఒకే చెప్పింది. దీంతో మార్టిన్ నిధిన్‌ను తన తల్లిదండ్రులకు పరిచయం చేయగా వాళ్లు కూడా దానికి సమ్మతించారు. దీంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఇద్దరూ అప్పటి నుంచి కలిసే ఉంటున్నారు.

అయితే నిధిన్‌కు తనకు ఎంతో ఇష్టమైన గురువాయూర్ ఆలయంలో పెళ్లి చేసుకోవాలనేది చిరకాల కోరిక. కానీ వరదలు, కొవిడ్ మహమ్మారి తదితర కారణాల వల్ల మార్టిన్ గతంలో మూడుసార్లు కేరళ వచ్చినా ఆమె గురువాయూర్ దర్శనం చేసుకోలేక పోయింది. కానీ ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో ఆయాలన్ని దర్శించుకోవాలని అనుకున్న నిధిన్ ఈ సారి తన కలను నెరవేర్చుకుంది. కుటుంబ సభ్యుల సమక్షంలో గురువాయూర్ ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం మార్డిన్‌ను పెళ్లి చేసుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us