బిగ్ బాస్ 10లో ఆ క్రేజీ బ్యూటీ.. ఇక రచ్చ రచ్చే అంటున్న ఫ్యాన్స్..

Rajitha Chanti

Pic credit - Instagram

19 August 2026

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 10 త్వరలోనే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

ఇప్పటివరకు తొమ్మిది విజయవంతమైన సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో, ఇప్పుడు పదో సీజన్‌తో మరింత సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.

ఈసారి షోను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు నిర్వాహకులు సరికొత్త ప్లాన్లతో ముందుకు వస్తున్నారు. 'అగ్నిపరీక్ష 2' ద్వారా ఫిల్టర్ చేసి హౌస్‌లోకి పంపనున్నారు.

అయితే ఈ సీజన్‌లో హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోయే కంటెస్టెంట్లు ఎవరనేది ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా ఓ క్రేజీ బ్యూటీ పేరు వినిపిస్తుంది.

సోనియా సింగ్ యూట్యూబ్, సోషల్ మీడియా వేదికగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. తన ప్రియుడు సిద్ధూతో కలిసి అనేక షార్ట్ ఫిలిమ్స్ ద్వారా నెటిజన్లను  ఆకట్టుకుంది.

ముఖ్యంగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా 'విరూపాక్ష'లో కీలక పాత్రలో నటించి తన నటనతో మంచి ప్రశంసలు అందుకుంది.  

 సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్, గ్లామర్‌తోగుర్తింపు తెచ్చుకున్న సోనియా బిగ్ బాస్ హౌస్‌కి వస్తే షో మరింత రసవత్తరంగా మారడం ఖాయమని అంటున్నారు.

 ఆమెతో పాటు ఎక్స్‌ప్రెస్ హరి, తేజస్విని, మంగ్లీ, యాంకర్ నిఖిల్, ఇన్‌ఫ్లుయెన్సర్ నందు వంటి పలువురి పేర్లు కూడా బిగ్ బాస్ 10 పోటీదారుల జాబితాలో వినిపిస్తున్నాయి.