AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: ఎంఎస్ ధోనీ టాప్ 7 అన్‌బీటబుల్ రికార్డులు.. ఇవి తిరగరాయడం ఎవరి తరం కాదు

MS Dhoni: ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లో సాధించిన అరుదైన రికార్డులు ఇప్పటికీ అభిమానులను ఆశ్చర్యపరుస్తాయి. మూడు ఐసీసీ ట్రోఫీలు, 332 మ్యాచ్‌ల కెప్టెన్సీ, 195 స్టంపింగ్స్, 183 పరుగుల నాటౌట్ సహా ధోనీ పేరిట ఉన్న టాప్ 7 అద్భుత రికార్డులు ఇవే.

MS Dhoni: ఎంఎస్ ధోనీ టాప్ 7 అన్‌బీటబుల్ రికార్డులు.. ఇవి తిరగరాయడం ఎవరి తరం కాదు
Ms Dhoni
Rakesh
|

Updated on: Aug 10, 2026 | 2:27 PM

Share

MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోనీ అనే పేరు ఒక ఐకానిక్ బ్రాండ్. కెప్టెన్‌గా, పవర్‌ఫుల్ ఫినిషర్‌గా, వికెట్ కీపర్‌గా టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన మహీ, ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన నాయకుడిగా నిలిచారు. జార్ఖండ్‌లోని రాంచీ అనే చిన్న నగరం నుంచి వచ్చి, దాదాపు 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ధోనీ పేరిట ఇప్పటికీ ఎవరూ దాటలేని కొన్ని అరుదైన రికార్డులు ఉన్నాయి.

1. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్

ప్రపంచ క్రికెట్ చరిత్రలో మూడు వేర్వేరు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన సారథ్యంలో భారత జట్టు 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను ముద్దాడింది. ఇప్పటివరకు అంతర్జాతీయంగా ఏ కెప్టెన్ కూడా ఈ మూడు ప్రధాన ఐసీసీ ట్రోఫీలను గెలుచుకోలేకపోయారు.

2. 332 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో సారథ్యం

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన వరల్డ్ రికార్డు కూడా ధోనీ పేరిటే ఉంది. టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి ధోనీ మొత్తం 332 మ్యాచ్‌ల్లో భారత జట్టును ముందుండి నడిపించారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ (324 మ్యాచ్‌లు) రెండో స్థానంలో ఉన్నారు.

3. వికెట్ వెనుక 195 అంతర్జాతీయ స్టంపింగ్‌లు

వికెట్ కీపర్‌గా ధోనీ ఎంత వేగంగా స్పందిస్తారో అందరికీ తెలిసిందే. తన మెరుపు వేగంతో బ్యాటర్లను పెవిలియన్‌కు పంపే మహీ, అంతర్జాతీయ క్రికెట్‌లో ఏకంగా 195 స్టంపింగ్‌లు చేశారు. ప్రపంచంలో మరే ఇతర వికెట్ కీపర్ కూడా ఇన్ని స్టంపింగ్‌లు చేయలేదు, ఇది ఇప్పటికీ చెక్కుచెదరని ప్రపంచ రికార్డు.

4. వన్డేల్లో వికెట్ కీపర్‌గా 183 పరుగుల ఆల్‌టైమ్ రికార్డు

2005లో జైపూర్ వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ధోనీ నాటౌట్‌గా 183 పరుగులు చేసి విధ్వంసం సృష్టించారు. వన్డే క్రికెట్ చరిత్రలో ఒక వికెట్ కీపర్ బ్యాటర్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్ ధోనీని భారతదేశంలో సరికొత్త స్టార్‌గా నిలబెట్టింది.

5. వన్డేల్లో 84 సార్లు నాటౌట్‌గా నిలిచిన ఫినిషర్

కష్టసమయాల్లో క్రీజులో నిలబడి మ్యాచ్‌ను గెలిపించడంలో ధోనీ ఆరితేరిపోయారు. అందుకే ఆయనను ది గ్రేటెస్ట్ ఫినిషర్ అని పిలుస్తారు. వన్డే క్రికెట్‌లో ధోనీ అత్యధికంగా 84 సార్లు నాటౌట్‌గా నిలిచారు. ఛేజింగ్‌లో వికెట్ పడకుండా చివరి వరకు ఉండి జట్టును విజయతీరాలకు చేర్చడం ఆయన ప్రత్యేకత.

6. కీపర్‌గా 829 డిస్మిసల్స్ (క్యాచ్‌లు + స్టంపింగ్స్)

కెరీర్‌లో వికెట్ కీపర్‌గా క్యాచ్‌లు, స్టంపింగ్‌లు కలిపి మొత్తం 829 డిస్మిసల్స్ చేసి ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన కీపర్లలో ఒకరిగా నిలిచారు. ఈ జాబితాలో సౌతాఫ్రికాకు చెందిన మార్క్ బౌచర్, ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్‌క్రిస్ట్ మాత్రమే ధోనీ కంటే ముందున్నారు.

7. టెస్టుల్లో భారత్‌ను నంబర్-1 స్థానానికి చేర్చిన తొలి కెప్టెన్

కెప్టెన్‌గా వన్డేలు, టీ20లలోనే కాకుండా టెస్టుల్లోనూ ధోనీ టీమిండియాను సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లారు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు తొలిసారిగా నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకోవడం ధోనీ సారథ్యంలోనే జరిగింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us