AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Lanka vs India: శ్రీలంకలో భారత్‌కు ఎందుకింత టెన్షన్? 12 మంది ఆటగాళ్లకు ఇదే తొలిసారి

Sri Lanka vs India: శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. 15 మంది సభ్యుల జట్టులో 12 మందికి శ్రీలంకలో టెస్టు అనుభవం లేదు. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ మాత్రమే లంక గడ్డపై ఆడారు. WTCలో కీలకమైన ఈ సిరీస్‌లో అనుభవ లేమి భారత్‌కు సవాలుగా మారనుంది.

Sri Lanka vs India: శ్రీలంకలో భారత్‌కు ఎందుకింత టెన్షన్? 12 మంది ఆటగాళ్లకు ఇదే తొలిసారి
Ind Vs Sl
Rakesh
|

Updated on: Aug 10, 2026 | 2:36 PM

Share

Sri Lanka vs India: భారత్, శ్రీలంక జట్ల మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆగస్టు 15, 2026 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని మొదటి టెస్ట్ మ్యాచ్ గాల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టిక పరంగా ఈ సిరీస్ రెండు జట్లకు చాలా కీలకమైనది. ఈ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసే జట్టు టాప్-4 లోకి ప్రవేశించే అవకాశం ఉంది. పేపర్ పైన టీమిండియా బలంగా కనిపిస్తున్నప్పటికీ ప్రస్తుత జట్టులో అనుభవ లేమి స్పష్టంగా కనిపిస్తోంది.

శ్రీలంకలో అనుభవం లేని భారత యంగ్ టీం

భారత టెస్ట్ స్క్వాడ్‌లోని 15 మంది ఆటగాళ్లలో ఏకంగా 12 మందికి శ్రీలంకలో ఎప్పుడూ అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడిన అనుభవం లేదు. కొంతమంది ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడినప్పటికీ, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు. జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు కూడా శ్రీలంక గడ్డపై టెస్ట్ ఆడిన అనుభవం లేదు. 50 టెస్టులు పూర్తి చేసుకున్న వికెట్ కీపర్ రిషభ్ పంత్ కూడా ఇప్పటివరకు శ్రీలంకలో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం. పంత్ తన కెరీర్‌లో భారత్ తర్వాత అత్యధికంగా ఇంగ్లాండ్ (13), ఆస్ట్రేలియా (12)లలో టెస్టులు ఆడారు.

లంకలో టెస్టులు ఆడిన ఆ ముగ్గురు ఆటగాళ్లు వీరే

ప్రస్తుత భారత స్క్వాడ్‌లో కేవలం ముగ్గురు ఆటగాళ్లకు మాత్రమే శ్రీలంకలో టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ మాత్రమే గతంలో లంకలో టెస్టులు ఆడారు.

కేఎల్ రాహుల్: శ్రీలంకలో 5 టెస్టులు ఆడి, 8 ఇన్నింగ్స్‌లలో 268 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

రవీంద్ర జడేజా: 2 టెస్టుల్లో 2 ఇన్నింగ్స్‌లు ఆడి 85 పరుగులు (ఒక నాటౌట్ 70) చేశాడు. అలాగే 4 ఇన్నింగ్స్‌లలో 13 వికెట్లు తీశాడు (ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన సహా).

కుల్దీప్ యాదవ్: ఒకే ఒక్క టెస్ట్ ఆడి మొత్తం 5 వికెట్లు పడగొట్టాడు.

భారత టెస్ట్ స్క్వాడ్ వివరాలు:

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ జైన్, ఆకిబ్ నబీ, సర్ఫరాజ్ ఖాన్.

హెడ్-టు-హెడ్ రికార్డులు, మ్యాచ్ సమయాలు

సొంత గడ్డపై శ్రీలంక జట్టును తక్కువ అంచనా వేయలేము. భారత్‌పై శ్రీలంక గెలిచిన మొత్తం 7 టెస్ట్ మ్యాచ్‌లు కూడా తమ సొంత గడ్డపైనే గెలవడం విశేషం. ఈ సిరీస్‌లోని మొదటి టెస్ట్ ఆగస్టు 15న గాల్‌ వేదికగా, రెండో టెస్ట్ ఆగస్టు 23న కోలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం ప్రతిరోజూ ఉదయం 10:00 గంటలకు ప్రారంభమవుతాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us