AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahuti Prasad : ఏంటీ.. నటుడు ఆహుతి ప్రసాద్ కొడుకు తెలుగులో ఆ హీరోనా.. ? ఎవరో తెలుసా..

తెలుగు సినిమా ప్రపంచంలో ఎంతో మంది నటీనటులు తమ సహజ నటనతో ఆకట్టుకున్నారు. వందల సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించి ఎంతో ఫేమస్ అయ్యారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షఖుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్న నటులు చాలా మంది ఉన్నారు. అందులో ఆహుతి ప్రసాద్ ఒకరు.

Ahuti Prasad : ఏంటీ.. నటుడు ఆహుతి ప్రసాద్ కొడుకు తెలుగులో ఆ హీరోనా.. ? ఎవరో తెలుసా..
Ahuti Prasad
Rajitha Chanti
|

Updated on: Mar 14, 2026 | 10:07 AM

Share

తెలుగు సినిమా ప్రపంచంలో విలక్షణమైన నటనతో చెరగని ముద్ర వేసిన నటీనటులు చాలా మంది ఉన్నారు. వైవిధ్యమైన పాత్రలు పోషించి గొప్ప నటులుగా పేరు సంపాదించుకున్నారు. హీరోహీరోయిన్లతోపాటు ఆ స్థాయిలో పాపులర్ అయిన క్యారెక్టర్ ఆర్టి్స్టుల గురించి చెప్పక్కర్లేదు. వారిలో ఆహుతి ప్రసాద్ ఒకరు. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. అక్కినేని నాగార్జున నటించిన మొదటి చిత్రం విక్రమ్ మూవీతో తెలుగు తెరకు నటుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. కానీ ఆహుతి ప్రసాద్ కు అంతగా గుర్తింపు రాలేదు. ఈ మూవీ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా విడుదలైన మరుసటి ఏడాదిలోనే డాక్టర్ రాజశేఖర్ హీరోగా డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఆహుతి చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా ఆయన కెరీర్ ను మలుపు తిప్పింది.

ఎక్కువమంది చదివినవి : Actress : మగాళ్ల నుంచి నన్ను నేను కాపాడుకోలేకపోయాను.. టాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్..

ఆహుతి సినిమా తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. ఈ చిత్రం తనకు గుర్తింపు తెచ్చిపెట్టిందని ఆ సినిమా టైటిల్ తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. తెలుగులో దాదాపు 117 చిత్రాల్లో నటించారు. ఆహుతి తర్వాత చందమామ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఈ సినిమా ఆయనకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆయన తదుపరి సినిమాలకు థియేటర్స్ బయట కటౌట్స్ పెట్టే స్థాయికి వెళ్లారు. చందమామ తర్వాత దాదాపు 85 సినిమాల్లో నటించారు. అయితే చేతినిండా సినిమాలు ఉన్న సమయంలోనే 2015లో ఆయన మరణించారు. ఇప్పటికీ ఆహుతి ప్రసాద్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. ఎక్కువమంది చదివినవి : Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..

ఇదంతా పక్కన పెడితే ఆహుతి ప్రసాద్ కుటుంబం విషయానికి వస్తే .. ఆయనకు ఇద్దరు కొడుకులు. కార్తీక్ ప్రసాద్, భరణి ప్రసాద్. ఆహుతి ప్రసాద్ కొడుకు కార్తీక్ ప్రసాద్ తెలుగులో మంచి నటుడు. సంతోష్ శోభన్ హీరోగా నటించిన కళ్యాణం కమనీయం అనే సినిమాలో ముఖ్య పాత్ర పోషించాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించాడు. కానీ ఇప్పటివరకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు.

ఎక్కువమంది చదివినవి : Actress : డబ్బు కోసమే అలాంటి సినిమాల్లో నటించా.. ఓపెన్‏గా చెప్పేసిన హీరోయిన్..

Ahuti Prasad Son

Ahuti Prasad Son

ఎక్కువమంది చదివినవి : సీరియల్స్‏లో లక్షల్లో సంపాదన.. శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే..

Follow Us