AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: మరికొన్ని గంటల్లో బిగ్‌ బాస్ 9 గ్రాండ్ లాంఛ్.. కంటెస్టెంట్ల లిస్టు లీక్ చేసిన ఆదిరెడ్డి

ఎప్పటిలాగే బిగ్ బాస్ రివ్యూలు చెప్పే మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్స్‌ లిస్టును లీక్ చేశాడు. మొత్తం సెలబ్రిటీలు, కామనర్స్ లిస్టును వీడియో రూపంలో రిలీజ్ చేశాడు. గతంలో ఆది రెడ్డి అంచనాలు చాలా వరకు నిజయమ్యాయి. కాబట్టి ఈసారి కూడా..

Bigg Boss Telugu 9: మరికొన్ని గంటల్లో బిగ్‌ బాస్ 9 గ్రాండ్ లాంఛ్.. కంటెస్టెంట్ల లిస్టు లీక్ చేసిన ఆదిరెడ్డి
Bigg Boss Telugu 9, Adi Reddy
Basha Shek
|

Updated on: Sep 07, 2025 | 8:27 AM

Share

బిగ్ బాస్.. బిగ్ బాస్.. బిగ్ బాస్.. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఇదే పేరు వినిపిస్తోంది. బుల్లితెర ఆడియెన్స్ ఎదురు చూపులకు తెర దించుతూ ఈ ఆదివారం (సెప్టెంబర్ 07) నుంచే బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచింగ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓపెనింగ్ ఎపిసోడ్ కు ఘాటీ చిత్ర బృందం కూడా రానున్నట్లు తెలిసింది. అనుష్క కూడా ఈ షోలో సందడి చేసే అవకాశముంది. మరోవైపు హౌస్ లో అడుగు పెట్టే కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సోషల్ మీడియాలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరు వస్తారన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. అయితే బిగ్ బాస్ గ్రాండ్ లాంఛ్ కు ముందు మాజీ కంటెస్టెంట్ ఆది రెడ్డి ఈసీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్ల లిస్టును లీక్ చేశాడు. గతంలో అతని అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి. కాబట్టి ఈసారి కూడా ఆదిరెడ్డి చెప్పిన కంటెస్టెంట్లలో చాలా మంది హౌస్ లోకి అడుగు పెట్టవచ్చు.

ఆదిరెడ్డి విశ్లేషణ ప్రకారం జబర్దస్త్ రీతూ చౌదరి, కమెడియన్ ఇమ్మానియేల్, రాను బొంబాయి రాను ఫేమ్ రాము రాథోడ్, సీరియల్ నటి తనూజా గౌడ, లక్స్ పాప ఆశా షైనీ, సీరియల్ విలన్ భరణి శంకర్, నటుడు సుమన్ శెట్టి, కొరియో గ్రాఫర్ శ్రష్టి వర్మ, సంజనా గల్రానీ వంటి సెలబ్రిటీలు హౌస్ లోకి అడుగు పెట్టనున్నారు.

ఇవి కూడా చదవండి

ఆది రెడ్డి రిలీజ్ చేసిన వీడియో ఇదిగో..

ఇక కామన్ మ్యాన్ కేటగిరి నుంచి ఐదు లేదా ఆరుగురిని కంటెస్టెంట్లుగా సెలెక్ట్‌ చేస్తారని ఆదిరెడ్డి చెప్పుకొచ్చారు. వారిలో మాస్క్‌ మ్యాన్ హరీశ్, మర్యాద మనీశ్, శ్రీజ, ఆర్మీ పవన్ కల్యాణ్, ప్రియా, పవన్ హౌస్‌లోకి వచ్చే అవకాశముందని ఈ మాజీ కంటెస్టెంట్ అంచనా వేశాడు. మరి ఆదిరెడ్డి చెప్పిన వాళ్లంతా బిగ్‌బాస్‌ హౌస్‌లో కనిపిస్తారా? లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

కాగా ఎప్పటిలాగే ఈ సీజన్ లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండనున్నాయి. షో ప్రారంభమైన రెండు వారాల తర్వాత కానీ, దీపావళి రోజు కానీ ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చే అవకాశముంది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా..

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం