OTT Movie: ఈ దెయ్యం ఆకలికి అంతే లేదు.. ఓటీటీలో లేటెస్ట్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హారర్, థ్రిల్లర్, మైథాలజీ కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ మూవీ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. ప్రస్తుతం ట్రెండ్ అయిన ఆత్మలు, దెయ్యాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. సినిమాలో వచ్చే ట్విస్టులు కూడా ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తాయి.

ప్రస్తుతం ఓటీటీల్లో హారర్ థ్రిల్లర్ సినిమాలదే హవా. ఆడియెన్స్ కూడా ఈ జానర్ సినిమాలు, సిరీస్ లనే ఎక్కువగా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీల్లో ఈ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. థియేటర్లలో పెద్దగా ఆడని హారర్ థ్రిల్లర్ సినిమాలు కూడా ఓటీటీలో రికార్డు వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఆగస్టు 08న థియేటర్లలో విడుదలైన ఈ తెలుగు సినిమా ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. అయితే చిన్న సినిమా ట్యాగ్, పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడంతో లాంగ్ రన్ కొనసాగించలేకపోయింది. ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్ర పోషించాడు. అలాగే మరో ప్రముఖ కమెడియన్ ప్రవీణ్ మరో ఇంపార్టెంట్ రోల్ లో ఆకట్టుకున్నాడు. కృష్ణభగవాన్ ,షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన పరమేశ్వర్ (ప్రవీణ్) తన నలుగురు స్నేహితులతో కలిసి ఒకే రూమ్‌లో ఉంటూ లైఫ్ లీడ్ చేస్తుంటారు. ఎలాగైనా ఒక రెస్టారెంట్ పెట్టాలనేది పరమేశ్వర్ కల. కానీ తగిన డబ్బులు లేకపోవడంతో మనసు చంపుకొని చిన్న ఉద్యోగం చేస్తుంటాడు. ఒకసారి డబ్బుల కోసం స్నేహితులను సలహా అడిగితే.. యూట్యూబ్‌లో దెయ్యాల వీడియోలు చేద్దామని సలహా ఇస్తారు.
అనుకున్నట్లుగానే పరమేశ్వర్ చేసిన మొదటి వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతుంది. రెండో వీడియో కోసం ఒక పాడు బడిన బంగ్లాకు వెళతారు. అక్కడ వారికి ఒక పుస్తకం దొరుకుతుంది. దానిని రూమ్‌కి తెచ్చుకుంటారు. ఈ పుస్తకంలో ఉన్నట్లుగా క్షుద్ర పూజలు చేయడంతో 200 ఏళ్ల నాటి ఆత్మ (వైవా హర్ష) ఒక నిమ్మకాయలోకి వస్తుంది. ఆ ఆత్మకు విపరీతమైన ఆకలి ఉంటుంది. ఇంట్లో ఉన్న ఆహారం మొత్తాన్ని తినేస్తుంది. చివరకు అది పరమేశ్వర్ స్నేహితుడు శరీరంలోకి ప్రవేశిస్తుంది. మరి ఆ ఆత్మను వదిలించుకోవడానికి పరమేశ్వర్ అతని స్నేహితులు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? అసలు ఆత్మ నేపథ్యమేంటి? ఎక్కడి నుంచి వచ్చింది? పరమేశ్వర్ స్నేహితుడి శరీరం నుంచి ఆ ఆత్మ బయటకు వెళ్లిందా లేదా? రెస్టారెంట్ పెట్టాలన్న పరమేశ్వర్ కోరిక నెరవేరిందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఈ సినిమా పేరు బకాసుర. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. సెప్టెంబర్ 12 నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
Five young souls. One dark force.
The nightmare begins on 12th September Watch It On SunNXT..!!#Bakasura #UnleashTheDarkness #WatchItOnSunNXT #SupernaturalThriller #StreamingFrom12thSeptemberOnSunNXT pic.twitter.com/AsWJJA2eKm
— SUN NXT (@sunnxt) September 5, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








