AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bappi Lahiri: డిస్కోకింగ్ బప్పీల హరి దగ్గర ఎంత బంగారం ఉండేది? ఆయన చనిపోయాక అదంతా ఏమైందో తెలుసా?

డిస్కోకింగ్‌గా పేరు తెచ్చుకున్న బప్పీల హరికి సంగీతంతో పాటు బంగారు ఆభరణాలంటే కూడా ఎంతో మక్కువ. ఎక్కడ కనిపించినా ఆయన చేతికి బంగారు కడియాలు, ఉంగరాలు, మెడలో బంగారు గొలుసులు ఉండేవి. ఇంతకీ బప్పీల హరి దగ్గర ఎంత బంగారముండేది? ఇప్పుడది ఏమైంది?

Bappi Lahiri: డిస్కోకింగ్ బప్పీల హరి దగ్గర ఎంత బంగారం ఉండేది? ఆయన చనిపోయాక అదంతా ఏమైందో తెలుసా?
Bappi Lahiri
Basha Shek
|

Updated on: Sep 04, 2025 | 8:18 PM

Share

డిస్కో మ్యూజిక్‌ను భారతీయ సంగీత ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత బప్పీల హరి కే చెందుతుంది. కేవలం 19 సంవత్సరాల వయసులోనే ఆయన సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. లెజెండరీ సింగర్ గా, సంగీత దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన పాటలకు ప్రాణం పోశారు. బాలీవుడ్ సినిమాలతో పాటు పలు తెలుగు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు బప్పీల హరి. సింహాసనం, స్టేట్ రౌడీ, గ్యాంగ్ లీడర్, రౌడీ గారి పెళ్లాం, రౌడీ అల్లుడు, రక్త తర్పణం, రౌడీ ఇన్ స్పెక్టర్, నిప్పు రవ్వ, బ్రహ్మ, ఖైదీ ఇన్ స్పెక్టర్ లాంటి ఎన్నో తెలుగు హిట్ సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. చివరిగా రవితేజ నటించిన డిస్కో రాజా సినిమాలోని ఓ పాటను కంపోజ్ చేశారీ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. ఇలా సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బప్పీలహరి (69) 2022లో కన్నుమూశారు. డిస్కోకింగ్‌గా పేరు తెచ్చుకున్న బప్పీల హరికి సంగీతంతో పాటు బంగారు ఆభరణాలంటే కూడా ఎంతో మక్కువ. ఎక్కడ కనిపించినా ఆయన చేతికి బంగారు కడియాలు, ఉంగరాలు, మెడలో బంగారు గొలుసులు ఉండేవి. ఈక్రమంలోనే ఆయనకు ‘గోల్డ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’ అని కూడా పేరొచ్చింది. మరి బప్పీల హరి చనిపోయిన తర్వాత ఆయన బంగారు ఆభరణాలు ఏమయ్యాయి? అసలు ఆయన దగ్గర ఉండే బంగారమెంత? అన్న విషయాలపై బప్పీల హరి కుమారుడు బప్పా లహరి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘ మా నాన్నకు చెందిన బంగారమంతా కుమారుడు, కుమార్తెకు చెందుతుందని వీలునామాలో రాశారు. మా నాన్న కేవలం ఫ్యాషన్ కోసం బంగార ఆభరణాలు ధరించలేదు. అవి ఆయనకు అదృష్టాన్ని తెచ్చి పెట్టాయి. ప్రపంచం నలుమూలల నుంచి బంగారాన్ని సేకరించారాయన. నాన్న బంగారం లేకుండా ఎక్కడికీ వెళ్లే వారు కాదు. ఉదయం 5 గంటలకు విమానంలో ప్రయాణించినా ఒంటిపై బంగారం ఉండాల్సిందే. ఒక రకంగా చెప్పాలంటే బంగారంతోనే నాన్న జీవితం ముడిపడింది.ఇక నాన్న చనిపోయిన తర్వాత ఆయన అభరణాలు భద్రంగా దాచి పెట్టాం. వీటిని మ్యూజియంలో పెట్టే ఆలోచన కూడా ఉంది. అప్పుడైతే అందరూ నాన్న బంగారు ఆభరణాలను చూసే అవకాశం ఉంటుంది’ అని బప్పా లహరి చెప్పుకొచ్చాడు.

బప్పీల హరి తన దగ్గరకు వచ్చిన ఎంతో మందికి బంగారు ఆభరణాలను బహుమతులుగా ఇచ్చారట. ఈ క్రమంలో ఆయన దగ్గర ఎంత బంగారముందో కచ్చితంగా తెలియదు.. కానీ.. 2014 బీజేపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసిన బప్పీల హరి నామినేషన్‌ సమయంలో తన వద్ద ఉన్న బంగారం, వెండి ఆభరణాల లెక్కలను బయటపెట్టారు. తన వద్ద 754 గ్రాముల బంగారం, 4.62 కిలోల వెండి, అదేవిధంగా తన సతీమణి వద్ద 967 గ్రాముల బంగారం, 8.9 కిలోల వెండి ఉందని అఫిడవిట్‌లో తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వర్షం కురిసింది.. పంట మురిసింది..
వర్షం కురిసింది.. పంట మురిసింది..
పొరలు పొరలుగా గుడ్డు పరాఠా.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది
పొరలు పొరలుగా గుడ్డు పరాఠా.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది
గోరింటాకు ఎర్రగా 10 నిమిషాల్లో పండాలంటే ఇది ఒక్కటి కలపండి చాలు
గోరింటాకు ఎర్రగా 10 నిమిషాల్లో పండాలంటే ఇది ఒక్కటి కలపండి చాలు
'టాక్సిక్'లో నయనతార రోల్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
'టాక్సిక్'లో నయనతార రోల్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
చాణక్య నీతి: డబ్బు విషయంలో ఈ తెలివి తక్కువ పనులు చేయకండి..!
చాణక్య నీతి: డబ్బు విషయంలో ఈ తెలివి తక్కువ పనులు చేయకండి..!
మసూద్ అజర్ ‘త్యాగం’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపిన ఐఎస్ఐ
మసూద్ అజర్ ‘త్యాగం’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపిన ఐఎస్ఐ
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. నగదు విత్ డ్రా రూల్స్‌లో మార్పులు..
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. నగదు విత్ డ్రా రూల్స్‌లో మార్పులు..
చెమటలు పట్టిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలో దుమ్మురేపుతుంది
చెమటలు పట్టిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలో దుమ్మురేపుతుంది
చనిపోయీ ముగ్గురికి పునర్జన్మచ్చిన హైదరాబాద్‌ యువకుడు
చనిపోయీ ముగ్గురికి పునర్జన్మచ్చిన హైదరాబాద్‌ యువకుడు
ఇరుముడి వివాదం.. క్రియేటివ్‌ ఫ్రీడమ్‌కు హద్దులెక్కడ?
ఇరుముడి వివాదం.. క్రియేటివ్‌ ఫ్రీడమ్‌కు హద్దులెక్కడ?