Bigg Boss 9 Agnipariksha: బిగ్ బాస్ కోసం విదేశాల నుంచి.. కట్ చేస్తే హౌస్‌లోకి అడుగు పెట్టకుండానే బయటకు..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఆదివారం (సెప్టెంబర్ 07)న సాయంత్రం బిగ్ బాస్ కొత్త సీజన్ లాంఛింగ్ ఉండనుంది. అయితే ఈసారి హౌస్ లోకి అడుగు పెట్టె కంటెస్టెంట్ల గురించి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

బిగ్ బాస్ హౌస్ లోకి ఈసారి సామాన్యులు కూడా అడుగు పెడుతున్నారు. ఇందుకోసం అగ్నిపరీక్ష పేరుతో ఒక కంటెస్టె నిర్వహిస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఇందుకోసం వేలాది మంది దరఖాస్తులు చేసుకోగా చివరగా 15 మందిని ఎంపిక చేశారు. ఇప్పుడు వీరిక మరిన్ని టాస్కులు నిర్వహించి సత్తా చాటిన వారిని హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా తీసుకోనున్నారు. ఈ బాధ్యతలను బిగ్ బాస్ విజేతలు అభిజిత్, బింధు మాధవి అలాగే మాజీ కంటెస్టెంట్ నవదీప్ లకు అప్పగించారు. శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తోన్నఈ బిగ్ బాస్ అగ్నిపరీక్ష తాజా ఎపిసోడ్‌లో రెండు కీలక ఎలిమినేషన్లు జరిగాయి. కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ఎంపికైన 15 మందిలో, ఇద్దరు కంటెస్టెంట్లు జ్యూరీ మెంబర్స్ తీసుకున్న కఠిన నిర్ణయంతో హౌస్ లోకి అడుగు పెట్టకుండానే బయటకు వెళ్లిపోయారు. ఎలిమినేట్ అయిన ఇద్దరు కంటెస్టెంట్స్ లో ఒకరు శ్వేతా శెట్టి కాగా మరొకరు ప్రసన్న కుమార్. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాలన్న గట్టి తలంపుతో విదేశాల నుంచి ఇండియాకు వచ్చింది శ్వేత. మొదట్లో గేమ్ బాగానే ఆడింది. టాస్కుల్లో సత్తా చాటింది. అయితే లేటెస్ట్ గా నిర్వహించిన బెలూన్ టాస్క్‌లో టీమ్‌ను గెలిపించలేకపోవడం శ్వేతపై ప్రతికూల ప్రభావం చూపింది.
ఇక ప్రసన్న కుమార్ విషయానికి వస్తే.. టాప్-15లో చోటు సంపాదించుకున్నాడు. తన వ్యక్తిత్వంతోనూ జడ్జీల అభిమానం పొందాడు.. కానీ ఫిజికల్ టాస్కుల్లో ఫెయిల్ కావడంతో అతనిని ఎలిమినేట్ చేశారు జ్యూరీ మెంబర్స్. ఈ క్రమంలో శ్వేత, ప్రసన్న ఎలిమినేషన్‌పై ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. “ కనీసం ప్రసన్నను హౌస్‌లో ఉండనివ్వాల్సింది’ అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ప్రసన్న కుమార్, శ్వేతా శెట్టి ఔట్..
Agnipariksha takes a chilling turn with Two Red Cards and surprise eliminations! 🚩
Bigg Boss Agnipariksha streaming now exclusively on JioHotstar! 💫 #BiggbossTelugu9 #Biggboss9Agnipariksha #StreamingNow #JioHotstar #JioHotstarTelugu pic.twitter.com/jnvznK4ZGP
— Starmaa (@StarMaa) September 3, 2025
కాగా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఇప్పటి వరకూ 2 ఎలిమినేషన్లు ముగియగా, మిగతా 13 మంది మిగిలారు. వీరిలో 5 మందిని కంటెస్టెంట్లుగా బిగ్ బాస్ హౌస్ లోకి పంపనున్నట్లు సమాచారం. మరో మూడు రోజుల్లో మరికొంతమంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాబోతుండగా, చివరకు ఆడియన్స్ ఓటింగ్ ఆధారంగా హౌస్‌లోకి ఎవరెవరు ప్రవేశిస్తారో తేలనుంది.
బిగ్ బాస్ అగ్ని పరీక్ష లేటెస్ట్ ప్రోమో..
Agnipariksha takes a chilling turn with Two Red Cards and surprise eliminations! 🚩
Bigg Boss Agnipariksha streaming now exclusively on JioHotstar! 💫 #BiggbossTelugu9 #Biggboss9Agnipariksha #StreamingNow #JioHotstar #JioHotstarTelugu pic.twitter.com/jnvznK4ZGP
— Starmaa (@StarMaa) September 3, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








