AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: తస్సాదియ్యా.. బుల్లిగౌనులో సీరియల్ బ్యూటీ రచ్చ.. గ్లామర్ ఫోజులతో గత్తరలేపుతున్న వయ్యారి..

సీరియల్ బ్యూటీస్ సోషల్ మీడియాలో చేస్తోన్న హడావిడి గురించి చెప్పక్కర్లేదు. ఓవైపు సీరియల్స్ ద్వారా రోజూ ప్రేక్షకులను అలరిస్తున్న ముద్దుగుమ్మలు.. ఇప్పుడు నెట్టింట మోడ్రన్ గ్లామర్ ఫోజులతో రచ్చ చేస్తున్నారు. తాజాగా ఓ అమ్మడు బుల్లిగౌనులో గత్తరలేపింది. చీరకట్టులో ఎంతో పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు.. తాజాగా క్రేజీ వీడియోతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.

Actress: తస్సాదియ్యా.. బుల్లిగౌనులో సీరియల్ బ్యూటీ రచ్చ.. గ్లామర్ ఫోజులతో గత్తరలేపుతున్న వయ్యారి..
Amulya Gowda
Rajitha Chanti
|

Updated on: Sep 03, 2025 | 7:33 PM

Share

ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్ కు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. నిత్యం ఎన్నో సీరియల్స్ ఉదయం నుంచి రాత్రి వరకు ప్రేక్షకులను అలరిస్తుంటాయి. రోటీన్ స్టోరీతో కథలు సాగినప్పటికీ.. తమ సహజ నటనతో జనాలను ఆకట్టుకుంటున్నారు నటీనటులు. ఈ మధ్యకాలంలో సీరియల్ తారలకు సైతం హీరోహీరోయిన్స్ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. అటు సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన కొందరు తారలు.. ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. అలాగే ఇటు సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఓ అమ్మడు గ్లామర్ ఫోజులతో రచ్చ చేస్తుంది. తాజాగా ఆమెకు సంబంధించిన క్రేజీ వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ? పైన ఫోటోలో అటు చీరకట్టులో… ఇటు బుల్లిగౌనులో కనిపిస్తున్న వయ్యారిని గుర్తుపట్టారా.. ? తెలుగు సీరియల్ ప్రియులకు ఇష్టమైన హీరోయిన్.

ఇవి కూడా చదవండి : OTT Movie: 25 కోట్ల బడ్జెట్.. ఆరేళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది..

ఇవి కూడా చదవండి

పైన ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ పేరు అమూల్య గౌడ. ఈ పేరు కంటే మీనా అని చెబితే ఠక్కున గుర్తుపట్టేస్తారు. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న గుండెనిండా గుడిగంటలు సీరియల్ లో మీన పాత్రలో నటిస్తుంది. ఇందులో అమాయకమైన అమ్మాయిగా కనిపిస్తూ అద్భుతమైన నటనతో కట్టిపడేస్తుంది. తక్కువ సమయంలోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ కన్నడ ముద్దుగుమ్మ. ఇప్పటికే కన్నడలో పలు సీరియల్స్ చేసింది. ఇక ఇప్పుడు తెలుగులో బిజీగా మారింది.

ఇవి కూడా చదవండి : Tollywood : అరె ఎంట్రా ఇది.. అప్పట్లో సెన్సేషన్ ఈ అమ్మడు.. ఇప్పుడు ఇలా.. ఎవరో గుర్తుపట్టారా.. ?

శ్రీగౌరీ అనే సీరియల్ ద్వారా కన్నడ సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు సీరియల్స్ చేసిన ఈ అమ్మడు కన్నడ బిగ్ బాస్ షోలోనూ పాల్గొంది. సీరియల్స్ లో పద్దతిగా చీరకట్టులో కనిపించే అమూల్య.. బయట మాత్రం గ్లామర్ లుక్స్ లో అగ్గి రాజేస్తుంది. ఈ అమ్మడు సోషల్ మీడియా పోస్టులు చూస్తే మతిపోవాల్సిందే. తన అందాలతో మెంటలెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి 5 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

ఇవి కూడా చదవండి :  Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన ఛాన్స్.. తెలుగులో క్యూ కట్టిన ఆఫర్స్..

View this post on Instagram

A post shared by Amulya M O (@amulya_omkar08)

ఇవి కూడా చదవండి : Tollywood : అప్పుడు బ్యాన్ చేశారు.. ఇప్పుడు వరుస ఆఫర్స్.. ఈ సీరియల్ బ్యూటీ క్రేజ్ చూస్తే..