OTT Movie: 25 కోట్ల బడ్జెట్.. ఆరేళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది..
ఓటీటీలో నిత్యం ఏదోక సినిమా ట్రెండ్ అవుతుంది. 6 సంవత్సరాల క్రితం థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించి చరిత్ర సృష్టించింది. అంతేకాదు.. 25 కోట్లతో తెరకెక్కిస్తే అదనంగా 7 రెట్లు ఎక్కువ సంపాదించింది. ఆసక్తికరంగా ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసా.. ?

కంటెంట్ బలంగా ఉంటే చాలు.. తక్కువ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించగలవు. 2018 సంవత్సరంలో విడుదలైన ఒక సినిమా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఆ సినిమాలో రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ లు ప్రధాన పాత్రలలో నటించారు. మనం మాట్లాడుతున్న సినిమా పేరు ‘స్త్రీ’. 2018లో విడుదలైన ఈ హర్రర్-కామెడీ చిత్రం ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఈ సినిమా ప్రజలను భయపెట్టడమే కాకుండా కడుపుబ్బా నవ్వించింది.
ఇవి కూడా చదవండి : Serial Actress: ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..
‘స్త్రీ’ కథ మధ్యప్రదేశ్‌లోని చందేరి ఆధారంగా రూపొందించారు. అక్కడ ఒక స్త్రీ ఆత్మగా మారి తిరుగుతుందని.. ఆమెను ప్రజలు ‘స్త్రీ’ అని పిలుస్తారు. ఆమెను నివారించడానికి ప్రజలు తమ ఇళ్ల గోడలపై ‘ఓ స్త్రీ రేపు రా’ అని రాసుకున్నారు. ఆ ఆత్మ కేవలం పురుషులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుంది. ఆమె వారిని తీసుకెళ్లి బట్టలు లేకుండా నిర్జన ప్రదేశంలో వదిలివేస్తుంది.
ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..
ఈ చిత్రంలో చందేరి ప్రజలను స్త్రీ నుండి రక్షించే బాధ్యతను తీసుకునే విక్కీ పాత్రను రాజ్ కుమార్ రావు పోషించారు. హర్రర్ తో పాటు, కామెడీతో సాగుతుంది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సంచలనం సృష్టిస్తోంది. భారతదేశంలోని టాప్ 10 ట్రెండింగ్ చిత్రాల జాబితాలో ఇది మూడవ స్థానంలో ఉంది. రూ.25 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.180 కోట్లు రాబట్టింది.
ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..
ఇవి కూడా చదవండి : గ్లామర్లో అరాచకం.. అందం ఉన్న కలిసిరాని అదృష్టం.. క్రేజ్ పీక్స్..




