AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kannappa OTT: అఫీషియల్.. ఎట్టకేలకు ఓటీటీలో కన్నప్ప.. మంచు విష్ణు, ప్రభాస్‌ డివోషనల్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

పరమ శివుని భక్తుడైన భక్త కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం కన్నప్ప. మంచు విష్ణుతో ప్రధాన పాత్ర పోషించాడు. అలాగే ప్రభాస్ మరో కీలకమైన రోల్ లో మెరిశాడు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ డివోషనల్ మూవీ సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రానుంది.

Kannappa OTT: అఫీషియల్.. ఎట్టకేలకు ఓటీటీలో కన్నప్ప.. మంచు విష్ణు, ప్రభాస్‌ డివోషనల్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Kannappa Movie
Basha Shek
|

Updated on: Sep 01, 2025 | 6:04 PM

Share

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం కన్నప్ప. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ డివోషనల్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లు వచ్చాయి. శివుని భక్తుడిగా మంచు విష్ణు నటన హైలెట్ గా నిలిచిందని ఆడియెన్స్ ప్రశంసలు కురిపించాడు. ఇక కనిపించేది కొద్ది సేపే అయినా రుద్ర పాత్రలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ అదరగొట్టాడని కాంప్లిమెంట్స్ వినిపించాయి. పలువురు సినీ ప్రముఖులు కూడా కన్నప్ప సినిమాను చూసి ప్రశంసలు కురిపించారు. అలాగే రాష్ట్రపతి భవన్ లోనూ ఈ మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించడం విశేషం. ఇలా ఎన్నో విశేషాలున్న ఈ కన్నప్ప సినిమాను ఓటీటీలో చూడాలని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. ఎట్టకేలకు వీరి ఎదురు చూపులకు తెరపడనుంది. కన్నప్ప ఓటీటీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నాలుగో తేదీ నుంచి కన్నప్ప సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు హీరో మంచు విష్ణు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘హర హర మహాదేవ’, హర్ ఘర్ మహాదేవ’ అంటూ తన పోస్ట్ కు క్రేజీ క్యాప్షన్ ఇచ్చాడు మంచు వారబ్బాయి.

. మహా భారతం సీరియల్ ఫేమ్, బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన కన్నప్ప సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్  శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి, , యోగి బాబు, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా (విష్ణు కూతుళ్లు) ఇలా చాలా మంది నటించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

ఇవి కూడా చదవండి

మరో మూడు రోజుల్లో అమెజాన్ ప్రైమ్ లోకి కన్నప్ప..

మరి థియేటర్లలో కన్నప్ప సినిమాను మిస్ అయ్యారా? లేదా మరోసారి చూడాలనుకుంటున్నారా? అయితే మరో మూడు రోజులు ఆగండి. ఎంచెక్కా ఇంట్లోనే ఈ విజువల్ వండర్‌ను చూసి ఎంజాయ్ చేసేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?