AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishal- Sai Dhansika: సాయి ధన్సికతో పెళ్లికి ముందే హీరో విశాల్ సంచలన నిర్ణయం.. ఇకపై సినిమాల్లో..

కొన్ని రోజుల క్రితమే తమ ప్రేమ విషయాన్ని ప్రకటించిన విశాల్- సాయి ధన్సిక ఇప్పుడు మరో ముందుడుగు వేశారు. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక ఈ ప్రేమ పక్షులు పమార్చుకోవాల్సింది పూలదండలు మాత్రమే. అంటే పెళ్లి మాత్రమే మిగిలి ఉంది.

Vishal- Sai Dhansika: సాయి ధన్సికతో పెళ్లికి ముందే హీరో విశాల్ సంచలన నిర్ణయం.. ఇకపై సినిమాల్లో..
Vishal, Sai Dhanshika
Basha Shek
|

Updated on: Aug 31, 2025 | 5:49 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తన 48వ పుట్టినరోజు (ఆగస్టు 29) ను మరింత మధురంగా మార్చుకున్నాడు. తన ప్రియురాలు, హీరోయిన్ సాయి ధన్సికతో ఎంగేజ్ మెంట్ చేసుకుని తన బర్త్ డేను మెమరబుల్ గా మార్చుకున్నాడు. చైన్నైలో విశాల్- సాయి ధన్సికల ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకకు విచ్చేశారు. కాబోయే దంపతులను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు. అయితే అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటికే విశాల్- సాయి ధన్సికల పెళ్లి జరిగి ఉండేది. కానీ కొన్ని కారణాలతో ఈ శుభకార్యం వాయిదా పడింది. అయితే మరో రెండు నెలల్లో తన పెళ్లి జరుగుతుందని విశాల్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం నడియార్ సంఘం భవనం నిర్మాణం జరుగుతోందని, మరో రెండు నెలలలో ఈ భవన నిర్మాణం పూర్తి కావడంతో అందులోనే తన వివాహాన్ని చేసుకోబోతున్నట్లు తెలిపాడు. మొత్తానికి ఎట్టకేలకు విశాల్ పెళ్లిపీటలు ఎక్కనుండడంతో అతని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

అయితే సాయి ధన్సికతో పెళ్లి నేపథ్యంలో సినిమాల పరంగా హీరో విశాల్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. అదేంటంటే.. పెళ్లి తర్వాత ఈ హీరో కిస్సింగ్ సీన్లలో నటించకూడదని నిర్ణయం తీసుకున్నాడట. రొమాంటిక్ సీన్లకు పెద్దగా అభ్యంతరం లేదు కానీ.. హీరోయిన్లతో లిప్ కిస్ సన్నివేశాలకు దూరంగా ఉంటానన్నాడట ఈ యాక్షన్ హీరో. ఈ నేపథ్యంలో ‘దేవుడు నాకోసం దేవకన్య లాంటి ధన్సికను పంపించారు’ అంటూ తన కాబోయే భార్య గురించి విశాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మొత్తానికి హీరో విశాల్ మంచి నిర్ణయం తీసుకున్నాడని అతని అభిమానులు స్పందిస్తున్నారు.  కాగా అక్టోబర్ లో విశాల్- సాయి ధన్సికల వివాహం జరగనుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

విశాల్, సాయి ధన్సికల ఎంగేజ్ మెంట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆధార్ యాప్‌లో కొత్త ఫీచర్.. క్యూఆర్ కోడ్ ద్వారానే..
ఆధార్ యాప్‌లో కొత్త ఫీచర్.. క్యూఆర్ కోడ్ ద్వారానే..
నాలుగు గ్రహాల అనుకూలత.. ప్రేమ, పెళ్లి ప్రయత్నాలకు గోల్డెన్ టైమ్..
నాలుగు గ్రహాల అనుకూలత.. ప్రేమ, పెళ్లి ప్రయత్నాలకు గోల్డెన్ టైమ్..
మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా..? ఈ తప్పులు చేయొద్దు..
మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా..? ఈ తప్పులు చేయొద్దు..
ప్రయాణికులకు గుడ్‌న్యూస్..ఇకపై రెగ్యులర్ సేవల్లోకి స్పెషల్ ట్రైన్
ప్రయాణికులకు గుడ్‌న్యూస్..ఇకపై రెగ్యులర్ సేవల్లోకి స్పెషల్ ట్రైన్
1925లో పుట్టి, 1925లోనే చనిపోయాడు.. కానీ 70ఏళ్లు బతికాడు! ఎలా..?
1925లో పుట్టి, 1925లోనే చనిపోయాడు.. కానీ 70ఏళ్లు బతికాడు! ఎలా..?
వైభవ్‎తో పాటు బ్లూ జెర్సీ వేసుకోబోయే నలుగురు ఐపీఎల్ హీరోలు వీళ్లే
వైభవ్‎తో పాటు బ్లూ జెర్సీ వేసుకోబోయే నలుగురు ఐపీఎల్ హీరోలు వీళ్లే
ఉసిరికాయ తొక్కు.. రోజుకొక స్పూన్ తింటే లో బీపీ, నీరసం పరార్
ఉసిరికాయ తొక్కు.. రోజుకొక స్పూన్ తింటే లో బీపీ, నీరసం పరార్
సీఎం విజయ్ వల్లే నా కడుపులో బిడ్డను కోల్పోయా..
సీఎం విజయ్ వల్లే నా కడుపులో బిడ్డను కోల్పోయా..
చంద్రుడి కటాక్షం.. త్వరలో వారికి అధికార యోగం పక్కా..!
చంద్రుడి కటాక్షం.. త్వరలో వారికి అధికార యోగం పక్కా..!
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ అదిరిపోయే న్యూస్..
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ అదిరిపోయే న్యూస్..