Balakrishna: హీరో బాలకృష్ణ గొప్ప మనసు.. వరద బాధితులకు భారీ విరాళం.. ఎంతంటే?
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా ప్రజలు ఇప్పటికీ వర్షపు నీటిలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు నందమూరి బాలకృష్ణ ముందుకొచ్చారు. తన వంతు సహాయంగా భారీ విరాళం ప్రకటించారు.

ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ విరాళం ప్రకటించారు. శనివారం (ఆగస్టు 30) హైదరాబాద్ లో జరిగిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య ఈ విరాళాన్ని ప్రకటించారు. ఈ వరదల్లో నష్టపోయిన అన్నదాతలు, సామాన్యులకు తన వంతుగా ఉడతా భక్తిగా ఈ సాయాన్ని అందిస్తున్నట్లు బాలయ్య పేర్కొన్నారు. మున్ముందు కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన పేర్కొన్నారుఅంతకు ముందు సినీ పరిశ్రమ నుంచి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సీఎం రిలీఫ్ ఫండ్ కు 10 లక్షల రూపాయలు విరాళంగా అందించారు.
50 ఏళ్ల ప్రస్థానం..
నందమూరి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు బాలకృష్ణ. నటనలోనూ, రాజకీయాల్లోనూ తండ్రికి తగ్గ కుమారుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. కొందరి హీరోలకు మాత్రమే సాధ్యమైన పౌరాణికి సినిమాలతోనూ బ్లాక్ బస్టర్స్ కొట్టారు. సినిమా ఇండస్ట్రీలోకి బాలయ్య అడుగు పెట్టి ఇటీవలే 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన అందిస్తోన్న సేవలకు గుర్తింపుగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆయనకు స్థానం దక్కింది.
#NandamuriBalakrishna garu has pledged ₹50 lakhs to the CM Relief Fund, lending hope and support to families affected by the devastating floods in Telangana. #NBK pic.twitter.com/rBnkXk9Uth
— VRMadhuPR (@VRMadhuPR) August 30, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








