OTT Movie: వామ్మో.. వరుసగా 49 మర్దర్లు.. ఓటీటీలో మతిపొగొట్టే క్రైమ్ థ్రిల్లర్.. ఐఎండీబీలో 9.6 రేటింగ్ మూవీ
ఈ ఏడాది జులైలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కూడా భారీగానే వచ్చాయి. ఇక ఐఎండీబీలో ఏకంగా 9.6 రేటింగ్ దక్కడం విశేషం. ఇప్పుడీ సూపర్ హిట్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

వినాయక చవితి సందర్భంగా ఈ వారం ఓటీటీ సినిమాల సందడి ముందుగానే ప్రారంభమైంది. బుధవారం (ఆగస్టు 27) అర్ధరాత్రి నుంచే చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన మూవీస్ కూడా వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఇందులో ఒక తమిళ్ సూపర్ హిట్ మూవీ కూడా ఉంది. ఈ ఏడాది జులై 11న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కోలీవుడ్ ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ను అందించింది. కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. ఇక ఐఎమ్ డీబీలోనూ ఈ మూవీకి ఏకంగా 9.6/10 రేటింగ్ రావడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. వాసన్ అనే ఒక ప్రముఖ రచయిత మ్యాగజైన్‌లో వీక్లీ కాలమ్‌లు రాస్తుంటాడు. ఇతని కథల్లోని పాత్రలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సెల్వి అనే ఒక పనిమనిషి, 2000 రూపాయలు దొంగిలించిందని ఆరోపణలు ఎదుర్కొంటుది. తన కొడుకు స్కూల్ ఫీజుల కోసం ఇబ్బందులు పడుతుంటుంది. ధనపాల్ అనే ఒక గ్యాంగ్‌స్టర్, 49హత్యలు చేసి 50వ హత్యకు కూడా రెడీ అవుతుంటాడు. అలాగే రాజి అనే ఒక గ్రామీణ అమ్మాయి, డాక్టర్ కావాలని కలలు కంటూ, డబ్బులు లేక నీట్ పరీక్ష రాయలేక సతమతమవుతుంటుంది. అయితే వాసన్ ఈ పాత్రలకు ఒక ట్రాజెడీ ముగింపు ఇస్తాడు.
అనూహ్యంగా వాక్షన్ కథల్లోని ఫిక్షనల్ క్యారెక్టర్లు అన్ని రియల్ వరల్డ్ లోకి వస్తాయి. తమకు న్యాయం జరగాలని ప్రశ్నిస్తాయి. రైటర్ వ్యాసన్ ఫోర్స్ చేస్తాయి. సెల్వి వాసన్ ను విషం కలిపిన పాలు తాగమని బలవంతం చేస్తుంది. ఆమె నుంచి తప్పించుకుని ఆస్పత్రిలో కళ్లు తెరిచే సరికి, అక్కడ రాజి నర్సుగా కనిపిస్తుంది. ఆ తర్వాత ధనపాల్ వాసన్ ను తన 50వ హత్య కోసం టార్గెట్ చేస్తాడు. మరి చివరకు ఏం జరిగింది? రైటర్ వాసన్ ఏం చేశాడన్నదే కథ.
తెలుగులోనూ స్ట్రీమింగ్..
The pen wrote their fate. Now they want answers. Maayakoothu streaming on SunNXT.
Watch Now On SunNXT..!!#Maayakoothu #SunNXT #StreamingNow #DarkComedy #FictionFightsBack #TamilMovies pic.twitter.com/bE1cYfxfnQ
— SUN NXT (@sunnxt) August 28, 2025
ఈ ఫ్యాంటసీ క్రైమ్ థ్రిల్లర్ పేరు మాయకూతు. ఎ.ఆర్. రాఘవేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నాగరాజన్ కన్నన్, ఢిల్లీ గణేష్, ము రామస్వామి, సాయి ధీనా, ఎస్.కె. గాయత్రి, ఐశ్వర్య రఘుపతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ 2025 ఆగస్ట్ 27నుంచి సన్ నెక్ట్స్ తో పాటు జీ5 ఓటీటీల్లోనూ లో తమిళం, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








