AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: అల్లు అర్జున్ స్టైల్ లో వినాయకుడి విగ్రహం.. మండపం.. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారో తెలిస్తే షాక్ అవుతారు

గతేడాది డిసెంబర్ లో పుష్ప 2 రిలీజైంది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేసింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో భారతీయ సినిమాగా రికార్డులకెక్కింది. అయితే ఇప్పటికీ ఈ పుష్ప 2 సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ వీడియోనే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం

Pushpa 2: అల్లు అర్జున్ స్టైల్ లో వినాయకుడి విగ్రహం.. మండపం.. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారో తెలిస్తే షాక్ అవుతారు
Pushpa 2 Set
Basha Shek
|

Updated on: Aug 27, 2025 | 4:25 PM

Share

దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. భక్తిశ్రద్ధలతో గణనాథుడికి పూజలు అందిస్తున్నారు. ఇక వీధుల్లో వివిధ రూపాల్లో గణపయ్యలు కొలువు దీరారు. ఇటీవల కాలంలో సినిమా హీరోల రూపంలో కూడా వినాయకుడి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఒక వినాయకుడి విగ్రహం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలోనే పుష్ప స్టైల్ లో వినాయకుడి విగ్రహాలు కొలువు దీరాయి. అయితే ఇప్పుడీ దీనికి నెక్ట్స్ లెవెల్ అనిపించేలా ఏకంగా వినాయక మండపాన్ని కూడా పుష్ప 2 సెట్ లానే తీర్చిదిద్దారు. అలాగే అల్లు అర్జున్ గెటప్ లో వినాయకుడు విగ్రహాన్ని కూడా ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వినాయకుడి మండపం చూస్తుంటే మాత్రం అచ్చం ఎర్రచందనంతోనే మండపాన్ని అలంకరించారా? అనే విధంగా ఏర్పాట్లు చేశారు. వీడియోను చూస్తే ముందుగా ఎంట్రన్స్ లో హెలికాప్టర్ వద్ద గన్ తో నిల్చున్న పుష్ప రాజ్ ను ప్రతిష్ఠించారు. ఇక ఎర్రచందనం దుంగల సెటప్ నుంచి లోపలికి వెళితే గంగమ్మ జాతరలో గెటప్, అలాగే రప్పా రప్పా ఫైట్ కాస్ట్యూమ్స్ లో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలాగే మండపంలో చాలా చోట్ల అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకు సంబంధించిన స్టిల్స్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి ఈ వినాయకుడి మండపం చూస్తుంటే అచ్చం సినిమా సెట్టును తలపిస్తుందని చెప్పాలి.

ఇవి కూడా చదవండి

తమిళనాడులోని హోసూరులో ఇలా సినిమా సెట్టు తరహాలో ఈ వినాయక విగ్రహాన్ని ఏర్పటు చేశారు. ఈ సెటప్ కోసం దాదాపు 30 లక్షల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అల్లు అర్జున్ అభిమానులు తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు.

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్.. ఎక్కడంటే..?
హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్.. ఎక్కడంటే..?
వర్షాకాలంలో గోడలపై వెనిగర్ స్ప్రే చేస్తే ఏం జరుగుతుంతో తెలుసా?
వర్షాకాలంలో గోడలపై వెనిగర్ స్ప్రే చేస్తే ఏం జరుగుతుంతో తెలుసా?
వర్షంలో మొబైల్ ఫోన్ తడిసిందా? వెంటనే ఇలా చేస్తే మీ ఫోన్‌ సేఫ్
వర్షంలో మొబైల్ ఫోన్ తడిసిందా? వెంటనే ఇలా చేస్తే మీ ఫోన్‌ సేఫ్
300కు పైగా సినిమాలు చేసిన ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?
300కు పైగా సినిమాలు చేసిన ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?
ఇంటి కిటికీకి స్టీల్ స్పూన్ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?..
ఇంటి కిటికీకి స్టీల్ స్పూన్ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?..
ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్రం నుంచి సూపర్ స్కీమ్..
ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్రం నుంచి సూపర్ స్కీమ్..
షుగర్ ఉన్నవారు కాఫీలో చెక్కరకు బదులు దాల్చిన చెక్క కలిపి తాగితే?
షుగర్ ఉన్నవారు కాఫీలో చెక్కరకు బదులు దాల్చిన చెక్క కలిపి తాగితే?
వావ్.. టాయిలెట్ చుట్టూ బేకింగ్ సోడా చల్లితే ఏం జరుగుతుందో తెలుసా?
వావ్.. టాయిలెట్ చుట్టూ బేకింగ్ సోడా చల్లితే ఏం జరుగుతుందో తెలుసా?
సుప్రీం కోర్టుకు చేరిన ఆలుగడ్డ పంచాయితీ!
సుప్రీం కోర్టుకు చేరిన ఆలుగడ్డ పంచాయితీ!
మధ్యాహ్నం కునుకు తీయడం అలవాటైందా?.. లైట్ తీసుకుంటే డేంజరే
మధ్యాహ్నం కునుకు తీయడం అలవాటైందా?.. లైట్ తీసుకుంటే డేంజరే