AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Teja: ఫ్లాప్‌ సినిమా కోసం ఇండస్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేశాడు! రవితేజ ఆ మూవీ చేసి ఉంటే బాగుండేదేమో!

ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ `మాస్‌ జాతర` అనే సినిమాలో నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఆగస్ట్ లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు అక్టోబర్‌కి వాయిదా పడినట్లు సమాచారం.

Ravi Teja: ఫ్లాప్‌ సినిమా కోసం ఇండస్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేశాడు! రవితేజ ఆ మూవీ చేసి ఉంటే బాగుండేదేమో!
Ravi Teja
Basha Shek
| Edited By: Rajitha Chanti|

Updated on: Aug 27, 2025 | 5:35 PM

Share

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన వాళ్లలో మాస్ మహారాజా రవితేజ ఒకడు. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు పోషించిన అతను ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమాతో హీరోగా సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఇడియట్, అమ్మానాన్నో తమిళ అమ్మాయి, ఖడ్గం, వెంకీ, భద్ర, విక్రమార్కుడు, కిక్‌ , శంభో శివ శంభో, బలుపు, పవర్‌, రాజా ది గ్రేట్‌ , క్రాక్‌ , వాల్తేర్‌ వీరయ్య లాంటి ఎన్నోబ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాడు. తన ఎనర్జిటిక్ యాక్టింగ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే చాలా మంది లాగే రవితేజకూడా కొన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడు. డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడం, స్టోరీలు సెట్ కాకపోవడం.. ఇలా వివిధ కారణాలతో చాలా సినిమాలను మిస్ అయ్యారు. అయితే రవితేజ వదులుకున్న సినిమాల్లో ఒక ఇండస్ట్రీ హిట్ కూడా ఉంది. అయితే ఒక ఫ్లాప్‌ మూవీ కోసం ఈ సినిమాను వదిలేసుకున్నారట.

రవితేజ- పూరి జగన్నాథ్ లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. వీరి కాంబోలో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం,ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, నేనింతే లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అయితే వీటితో పాటు పూరీ తన మరో మూవీని కూడా రవితేజతోనే తెరకెక్కించాలనుకున్నారట. కథ కూడా ఓకే చెప్పించుకున్నారు. `ఉద్దమ్‌ సింగ్‌ సన్నాఫ్‌ సూర్యనారాయణ` పేరుతో మూవీని కూడా ప్రకటించారట. త్రిషను హీరోయిన్ గా తీసుకున్నారట. అయితే అదే సమయంలో రవితేజ వద్దకు మరో ప్రాజెక్ట్ వచ్చింది. అదే తమిళంలో సూపర్ డూపర్ హిట్టయిన ‘ఆటోగ్రాఫ్’ తెలుగు రీమేక్ లోఛాన్సు. స్టోరీ హార్ట్ టచింగ్ గా ఉండడంతో ఆ మూవీని రవితేజ వదులుకోలేకపోయాడు. మరోవైపు పూరీ తన ప్రాజెక్టు లేట్ అవ్వకూడదని మహేష్ దగ్గరకు వెళ్లాడు. అతను కథ విని ఒకే చెప్పాడంతో ప్రాజెక్టు పట్టాలెక్కంది. కట్ చేస్తే .. ఈ సినిమా బాక్సాఫీస్‌ ని షేక్‌ చేసింది. టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లని సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇలా రవితేజ మిస్ చేసుకున్న ఆ ఇండస్ట్రీ హిట్‌ మరేదో కాదు పోకిరి.

ఇవి కూడా చదవండి

రవితేజతో పాటు పవన్ కల్యాణ్ కూడా పోకిరి సినిమాను మిస్ చేసుకున్నారని గతంలో ప్రచారం జరిగింది. అయితే ఇందులో నిజమెంతుందో తెలియదు.

మాస్ జాతర సినిమాలో రవితేజ, శ్రీలీల..

View this post on Instagram

A post shared by RAVI TEJA (@raviteja_2628)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..