AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Animal Movie: ఎంత పని చేశావ్ అమ్మడు.. యానిమల్ సినిమాలో జోయా పాత్ర మిస్ చేసుకున్న హీరోయిన్.. ఎవరంటే..

సాధారణంగా చాలా మంది హీరోయిన్స్ సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తుంటారు. కొందరు ఒక్క సినిమాతోనే ఫేమస్ అవుతుంటారు. అలా చిన్న పాత్రతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకుంది త్రిప్తి డిమ్రీ. ఆమె నటించిన యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

Animal Movie: ఎంత పని చేశావ్ అమ్మడు.. యానిమల్ సినిమాలో జోయా పాత్ర మిస్ చేసుకున్న హీరోయిన్.. ఎవరంటే..
Animal Movie
Rajitha Chanti
|

Updated on: Aug 27, 2025 | 3:34 PM

Share

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. అర్జున్ రెడ్డి సినిమాతో బాక్సాఫీష్ షేక్ చేశారు. ఆ తర్వాత కబీర్ సింగ్ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించారు. ఇక ఇటీవలే యానిమల్ మూవీతో మరోసారి థియేటర్లలో సత్తా చాటారు. బీటౌన్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీ ఎంత పెద్ద హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై కలెక్షన్స్ విషయంలో దుమ్మురేపింది. ఈ సినిమాపై ఓవైపు విమర్శలు వచ్చినప్పటికీ.. అడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రణబీర్, రష్మికతోపాటు త్రిప్తి డిమ్రీ, అనీల్ కపూర్, బాబీ డియోల్ సైతం కీలకపాత్రలు పోషించారు. ముఖ్యంగా ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది త్రిప్తి. అంతకు ముందు హిందీలో పలు సినిమాలు చేసినా రానీ క్రేజ్.. యానిమల్ సినిమాలో పోషించిన చిన్నపాత్రతో ఫేమస్ అయిపోయింది.

ఇవి కూడా చదవండి : OTT Movies: ఏం సినిమా గురూ ఇది.. కోర్టులో ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో ఈ మూవీస్ చూస్తే..

ఇవి కూడా చదవండి

యానిమల్ సినిమాతో త్రిప్తి కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. సౌత్ టూ నార్త్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో రణబీర్, త్రిప్తి మధ్య వచ్చే సీన్స్ పై విమర్శలు వచ్చినప్పటికీ.. త్రిప్తి పేరు మాత్రం ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. అయితే ఈ సినిమాలో జోయా పాత్రలో త్రిప్తి నటించగా.. ఆ పాత్రకు ముందుగా అనుకున్న హీరోయిన్ మాత్రం వేరే అంట. బాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాలో జోయా పాత్రకు ముందుగా సారా అలీ ఖాన్ ఆడిషన్ చేసిందట. కానీ ఈ సినిమాలో సారాకు ఛాన్స్ రాలేదని.. చివరకు ఆ పాత్రలో త్రిప్తి డిమ్రి నటించిందట.

ఇవి కూడా చదవండి : Nayanthara : ఆ సినిమా చేయడం జీవితంలోనే చెత్త నిర్ణయం.. నయనతార సంచలన కామెంట్స్..

అయితే జోయా పాత్రకు సారా అలీ ఖాన్ అడిషన్ చేయలేదట. సారా గురించి నెట్టింట జరుగుతున్న ప్రచారం మొత్తం అవాస్తవమని టాక్. దీనిపై ఇప్పటివరకు సారా స్పందించలేదు. ఈ సినిమాలో త్రిప్తి పాత్రపై విమర్శలు వచ్చినప్పటికీ.. ఒక్క సీన్ తో తెగ ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న స్పిరిట్ చిత్రంలో నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

ఇవి కూడా చదవండి : Cinema : ఓటీటీలో అదరగొడుతున్న కామెడీ థ్రిల్లర్.. 2 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్..

ఇవి కూడా చదవండి : Tollywood: ఎంగేజ్మెంట్ క్యాన్సిల్.. హీరోలతో ఎఫైర్ రూమర్స్.. 42 ఏళ్ల వయసులో దుమ్మురేపుతోన్న హీరోయిన్.. 

Follow Us
ఎంత ముదురు మటన్‌ అయినా.. ఇవి వేస్తే నిమిషాల్లోనే ముక్క మెత్తగా..
ఎంత ముదురు మటన్‌ అయినా.. ఇవి వేస్తే నిమిషాల్లోనే ముక్క మెత్తగా..
రోజ్ వాటర్‌తో ముఖం కాంతివంతంగా మారుతుందా? అసలు నిజం ఇదే!
రోజ్ వాటర్‌తో ముఖం కాంతివంతంగా మారుతుందా? అసలు నిజం ఇదే!
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి
కబ్రా కాన్ ఏనుగు బీభత్సం.. పట్టుకునేందుకు 100 మంది అటవీ సిబ్బంది
కబ్రా కాన్ ఏనుగు బీభత్సం.. పట్టుకునేందుకు 100 మంది అటవీ సిబ్బంది
వామ్మో.. బంగారం ధర ఇంత తగ్గిందా..? ఎవ్వరు ఊహించరేమో..!
వామ్మో.. బంగారం ధర ఇంత తగ్గిందా..? ఎవ్వరు ఊహించరేమో..!
నాటు కోడి vs పుంజు తలపడితే ఏది గెలుస్తుందో తెలుసా?
నాటు కోడి vs పుంజు తలపడితే ఏది గెలుస్తుందో తెలుసా?
ఐసీసీ ఛైర్మన్‌గా మరోసారి జై షా.. ఏకగ్రీవంగా ఎన్నిక
ఐసీసీ ఛైర్మన్‌గా మరోసారి జై షా.. ఏకగ్రీవంగా ఎన్నిక
కరకరలాడే మసాలా వడలు.. బయట బండిపై రుచి ఇంట్లోనే ఇలా తయారు చేయండి!
కరకరలాడే మసాలా వడలు.. బయట బండిపై రుచి ఇంట్లోనే ఇలా తయారు చేయండి!
పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న.. ఐదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా
పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న.. ఐదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా