Nayanthara : ఆ సినిమా చేయడం జీవితంలోనే చెత్త నిర్ణయం.. నయనతార సంచలన కామెంట్స్..
లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. నాలుగు పదుల వయసులోనూ వరుస సినిమాలతో అలరిస్తుంది. అయితే ఓ స్టార్ హీరో సినిమాలో నటించడం తన జీవితంలో చెత్త నిర్ణయమని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ?

ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలోని స్టార్ హీరోయిన్లలో నయనతార ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టి స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. నాలుగు పదుల వయసులోనూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. హీరోలకు మించి స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇటీవలే జవాన్ సినిమాతోనూ హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోలకు మించిన పారితోషికం తీసుకుంటుంది. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న కొత్త ప్రాజెక్టులో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో నయనతార చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఓ హీరో సినిమాలో నటించి తప్పు చేశానని అంటుంది.
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 90 కోట్లతో తీస్తే 9 కోట్లు లేదు.. బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్..
తెలుగు, తమిళం, మలయాళం భాషలలో స్టార్ హీరోలతో కలిసి నటించింది నయన్. కానీ సినిమాల కంటే ఎక్కువగా పర్సనల్ విషయాలతోనే వార్తలలో నిలుస్తుంది. ఇటీవల ఆమె తన భర్తతో విడాకులు తీసుకుబోతుందంటూ ప్రచారం నడించింది. అయితే ఆ రూమర్స్ అన్ని అవాస్తవాలు అంటూ కొట్టిపడేసింది. అయితే తాను చేసిన సినిమాల్లో, తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత చెత్త డెసిషన్ గజినీ సినిమా చేయడమే అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : Shilpa Shetty: ఏం అందం రా బాబూ.. 50 ఏళ్ల వయసులో పాతికేళ్ల అమ్మాయిలా.. ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన శిల్పా శెట్టి..
2005లో ఏఆర్ మురగదాస్ తెరకెక్కించిన గజినీ చిత్రంలో సూర్య హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆసిన్ కథానాయికగా నటించగా.. నయన్ సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. అయితే ఈ సినిమాలో తనను చెడుగా చూపించారని.. హీరోయిన్ పాత్రకు దగ్గరగా ఉందని చెప్పి.. అలా చూపించలేదని అన్నారు. అది తనను ఎంతో బాధించిందని.. ఆసినిమా చేసి తప్పు చేశానని గతంలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నయన్ కామెంట్స్ మరోసారి నెట్టింట వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : Chandramukhi: వామ్మో.. ఈ అమ్మడు చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్టా.. ? ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గురూ..
ఇవి కూడా చదవండి : Actress : కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. యాక్టింగ్ మానేసి వ్యవసాయం చేసుకుంటున్న హీరోయిన్.. ఎందుకంటే..




