Actress : అప్పుడు స్టార్ హీరోయిన్.. సినిమాలు మానేసి పల్లెటూరిలో సింపుల్ లైఫ్.. వ్యవసాయం చేస్తోన్న బ్యూటీ..
ఒకప్పుడు సినిమాల్లో టాప్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన తారలు.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అప్పట్లో చేతినిండా సినిమాలతో చక్రం తిప్పిన స్టార్స్.. ఇప్పుడు వ్యాపారరంగాల్లో సెటిల్ అయ్యారు. కానీ మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మాత్రం గత ఏడేళ్లుగా వ్యవసాయం చేస్తూ లైఫ్ లీడ్ చేస్తుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

సినిమా ప్రపంచంలో అందం, అభినయంతో కట్టిపడేసిన తారలు చాలా మంది ఉన్నారు. ఒక్క సినిమాతోనే ఊహించని ఫాలోయింగ్ సంపాదించుకుని.. ఆ తర్వాత వరుస చిత్రాలతో మెప్పించిన ముద్దుగుమ్మల గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో జనాల హృదయాలు గెలుచుకున్నవారు ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అయితే ఒకప్పుడు నటిగా ఓ వెలుగు వెలిగిన తారలు..ఇప్పుడు వ్యాపారరంగాల్లో సెటిల్ అయ్యారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం ఏడేళ్లుగా వ్యవసాయం చేస్తూ లైఫ్ గడిపేస్తుంది. ఆమె పేరు రతన్ రాజ్ పుత్. ఆమె బుల్లితెర ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ‘అగలే జనమ్ మోహే బిటియా హి కిజో’ అనే బిరుదుతో ప్రజలకు మరింత దగ్గరయ్యింది. కానీ ఇప్పుడు ఆమె నటనను వదిలేసింది.
ఇవి కూడా చదవండి : Actress : ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇప్పుడు 5 కంపెనీలకు యజమాని.. రూ.2000 కోట్ల ఆస్తులు.. ఎవరంటే..
సీరియల్స్ తో పాటు, రతన్ టీవీలో తన సొంత షోను సృష్టించింది. చివరిగా సంతోషి మా సీరియల్లో కనిపించింది. 2020లో ప్రసారం అయింది. అదే సమయంలో డిప్రెషన్ కారణంగా ఆమె నటన వృత్తిని వదులుకుంది. 2018లో రతన్ తండ్రి మరణించారు. దీంతో ఆమె ఆ దుఃఖాన్ని భరించలేకపోయింది. నెమ్మదిగా డిప్రెషన్ భారిన పడింది. తండ్రి మరణంతో తీవ్ర దుఃఖంలో ఉండిపోయిన ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. నటన మానేసి ప్రశాంతమైన జీవితాన్ని ఎంపిక చేసుకుంది.
ఇవి కూడా చదవండి : Cinema : 26 రోజుల్లోనే 280 కోట్ల కలెక్షన్స్.. రికార్డ్ సృష్టించిన తొలి యానిమేటెడ్ సినిమా ఇది..
మానసిక వైద్యుడితో మాట్లాడి ముంబై వదిలి తన గ్రామంలో స్థిరపడాలని నిర్ణయించుకుంది. అక్కడ ఆమె గ్రామస్తులతో కలిసి వ్యవసాయం చేయడం ప్రారంభించింది. ఆమె గ్రామంలో నివసిస్తోంది.
ఇవి కూడా చదవండి : Cinema : రెండు గంటల సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ.. దెబ్బకు దద్దరిల్లిన బాక్సాఫీస్.. ఎక్కడ చూడొచ్చంటే..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Cinema: రూ.70 లక్షల బడ్జెట్.. 70 కోట్ల కలెక్షన్స్.. 460 రోజులు థియేటర్లలో రచ్చ చేసిన సినిమా..








