AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : 26 రోజుల్లోనే 280 కోట్ల కలెక్షన్స్.. రికార్డ్ సృష్టించిన తొలి యానిమేటెడ్ సినిమా ఇది..

భారతీయ యానిమేటెడ్ చిత్రం రూ.300+ క్లబ్‌లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది. కేవలం 26 రోజుల్లో రూ.280 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసా.. ? ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. స్టార్ హీరోహీరోయిన్స్ లేరు.. గ్లామర్ పాటలు, యాక్షన్ సీన్స్ అసలే లేవు... అయినా ఈ చిత్రానికి బ్రహ్మారథం పట్టారు.

Cinema : 26 రోజుల్లోనే 280 కోట్ల కలెక్షన్స్.. రికార్డ్ సృష్టించిన తొలి యానిమేటెడ్ సినిమా ఇది..
Rajitha Chanti
|

Updated on: Aug 22, 2025 | 7:20 AM

Share

భారతీయ సినిమా ప్రపంచంలో పౌరాణిక కథలు, రొమాంటిక్ కామెడీ సినిమాలు తమదైన ముద్ర వేశాయి. లైవ్-యాక్షన్ బ్లాక్‌బస్టర్స్ సాధించిన సినిమాలు అనేకం ఉన్నాయి. కానీ బాక్సాఫీస్ ఆధిపత్యాన్ని సాధించే యానిమేటెడ్ చిత్రం చాలా అరుదు. హోంబాలే ఫిల్మ్స్ , క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన, మహావతార్ నరసింహ సినిమా చరిత్రను తిరిగి రాస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లు వసూలు చేసింది. 2025 జూలై 25న విడుదలైన మహావతార్ నరసింహ ఐదు భారతీయ భాషలలో 3Dలో విడుదలై అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం కేవలం 26 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 280 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లు దాటిన తొలి భారతీయ యానిమేటెడ్ చిత్రంగా కూడా నిలిచింది.

వాణిజ్యపరంగా విజయం సాధించడమే కాకుండా, ఇది యానిమేషన్‌లో భారతీయ సినిమా ఇమేజ్‌ను నెలకొల్పింది. అత్యాధునిక యానిమేషన్ టెక్నాలజీతో సాంప్రదాయ పురాణాలను కలిపి ఈ సినిమాను రూపొందించారు. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గ్రాండ్ విజువల్స్, భావోద్వేగ కథ, పౌరాణిక మూలాల నుండి తీసుకున్న అంశాలు జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి.

విష్ణువుకు సంబంధించిన పది అవతారాల ఆధారంగా సినిమాలను రూపొందించనున్నట్లు హోంబాలే ప్రకటించింది. మహావతార్ పరశురామ్ (2027), మహావతార్ రఘునందన్ (2029), మహావతార్ ద్వారకాధీష్ (2031), మహావతార్ గోకులానంద (2033), మహావతార్ కల్కి (2037), (20375) తో రెండు-భాగాల ముగింపుతో సినిమాలను తీసుకురానున్నారు.

ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..

Follow Us
ఫిట్‌నెస్ లేక పక్కకు తప్పుకున్న హార్దిక్
ఫిట్‌నెస్ లేక పక్కకు తప్పుకున్న హార్దిక్
పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? ఈ మిస్టేక్స్ చేస్తే నష్టం
పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? ఈ మిస్టేక్స్ చేస్తే నష్టం
బిగ్ బాస్ తెలుగు 10 నుంచి ఆమె అవుట్
బిగ్ బాస్ తెలుగు 10 నుంచి ఆమె అవుట్
లవంగాల నైట్ క్రీమ్‌‌తో ముడతలు మాయం..ఇంట్లోనే తయారు చేసుకునే సహజ
లవంగాల నైట్ క్రీమ్‌‌తో ముడతలు మాయం..ఇంట్లోనే తయారు చేసుకునే సహజ
రాష్ట్రంలో కొత్తగా మరో 9లక్షల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!
రాష్ట్రంలో కొత్తగా మరో 9లక్షల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!
పచ్చిమిర్చిని తక్కువ అంచనా వేయకండి!ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే
పచ్చిమిర్చిని తక్కువ అంచనా వేయకండి!ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే
ఈ టీచర్ మామూలోడు కాదు.. చిట్టీల పేరుతో కోట్లు వసూల్.. కట్ చేస్తే
ఈ టీచర్ మామూలోడు కాదు.. చిట్టీల పేరుతో కోట్లు వసూల్.. కట్ చేస్తే
ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను..
ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను..
పాకిస్థాన్ క్రికెట్‌కు వరుస షాకులు.. ఏకంగా రూ.25 కోట్ల భారీ నష్టం
పాకిస్థాన్ క్రికెట్‌కు వరుస షాకులు.. ఏకంగా రూ.25 కోట్ల భారీ నష్టం
ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి..
ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి..