Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..
దుల్కర్ సల్మాన్.. పాన్ ఇండియా సినీప్రియులకు ఇష్టమైన హీరోలలో ఒకరు. మలయాళీ చిత్రపరిశ్రమలో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ హీరో.. ఇప్పుడు తెలుగు, హిందీ, తమిళం భాషలలోనూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న విభిన్న చిత్రాలను ఎంచుకుంటూ జనాలను ఆకట్టుకుంటున్నారు. తాజాగా తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరనేది చెప్పుకొచ్చారు.

మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి నటవారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు దుల్కర్ సల్మాన్. విభిన్న కంటెంట్ కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. మలయాళంలో అనేక చిత్రాల్లో నటించిన దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు తెలుగు పరిశ్రమలోనూ స్టార్ హీరోగా రాణిస్తున్నారు. వరుస హిట్లతో చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్నారు. కొన్ని రోజుల క్రితం లక్కీ భాస్కర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. వెంకీ అట్లూరీ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. ప్రస్తుతం తెలుగు, మలయాళం భాషలలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు దుల్కర్. ఇక ఈ హీరోకు అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే. కానీ మీకు తెలుసా.. ? దుల్కర్ సల్మాన్ కు ఓ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టమట. ఎప్పటికైనా ఆమెతో ఓ సినిమా చేయాలనే కోరిక కూడా ఉందట.
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..
దుల్కర్ సల్మాన్ కు ఇష్టమైన హీరోయిన్ మరెవరో కాదండి.. బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కాజోల్. హిందీ చిత్రపరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె.. ఇప్పటికీ సినిమాల్లో కొనసాగుుతంది. అందం, అభినయంతో 90వ దశకంలో ఇండస్ట్రీని ఏలేసిన ఈ అమ్మడు.. ప్రతి పాత్రకు ప్రాణం పోసింది. ముఖ్యంగా షారుఖ్, కాజోల్ జోడీ గురించి చెప్పక్కర్లేదు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. తనకు హీరోయిన్ కాజోల్ తో నటించాలని ఉందని.. ప్రతి సినిమాలో ఆమె పాత్రలను చూపించిచన తీరు అద్భుతంగా ఉంటుందని.. అనేక పాత్రలకు తన నటనతో జీవం పోస్తుందని అన్నారు.
ఇవి కూడా చదవండి : Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోన్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..
ప్రతి కథలోని భావోద్వేగాలను సరిగ్గా అర్థం చేసుకోగలరని.. ఆమె నవ్వితే గుండెల్లో నుంచి నవ్వినట్లుగా ఉంటుందని.. ఇక ఎమోషనల్ పాత్రలలో తన నటనతో జనాలను ఏడిపిస్తుందని అన్నారు. ఆమెతో ఒక్క సినిమా అయినా చేయాలని ఉందన్నారు దుల్కర్ సల్మాన్. హిందీలో ఎక్కువగా సినిమాల్లో నటించిన కాజోల్.. కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన వీఐపీ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించింది.
ఇవి కూడా చదవండి : Cinema : 4 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తున్న మహేష్ బాబు సినిమా.. 75 కోట్లు పెడితే రూ.214 కోట్లు కలెక్షన్స్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Arundhathi: కొరియోగ్రాఫర్‌ను పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫ్రెండ్స్‌తో బ్యాచిలర్ పార్టీ..








