AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR కాదు.. విలన్‌గా వార్‌2లో సర్‌ప్రైజ్ స్టార్

NTR కాదు.. విలన్‌గా వార్‌2లో సర్‌ప్రైజ్ స్టార్

Phani CH
|

Updated on: Aug 13, 2025 | 6:17 PM

Share

వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ రోల్ లో నటించాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై చిత్ర బృందం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇంతలో ‘వార్ 2’ టీమ్‌లో మరో స్టార్ ఆర్టిస్ట్ చేరాడని తెలుస్తోంది. ‘యానిమల్’ సినిమాలో విలన్ గా నటించిన తర్వాత బాబీ డియోల్ కు డిమాండ్ బాగా పెరిగింది. ఇప్పుడతను హిందీతో పాటు దక్షిణాది సినిమాల్లోనూ విలన్ గా యాక్ట్ చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే ‘వార్ 2’ సినిమాలో కూడా బాబీ డియోలే మెయిన్ విలన్ గా కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ‘వార్ 2’ ఆగస్టు 14న విడుదల కానుంది. అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఇప్పటికే జోరుగా జరుగుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు విడుదలవుతున్న ఈ సినిమా కు పాజిటివ్ రివ్యూలు వస్తే వారాంతంలో భారీ మొత్తంలో వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. ‘వార్ 2’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నెగటివ్ రోల్ పోషించే అవకాశం ఉందని కొందరు ఊహిస్తున్నారు. అది నిజమో కాదో సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. ‘యష్ రాజ్ ఫిల్మ్స్’ ‘వార్ 2’ చిత్రాన్ని నిర్మించింది. దీనికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ‘వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్’ నుంచి వచ్చిన టైగర్ (సల్మాన్ ఖాన్), పఠాన్ (షారుఖ్ ఖాన్) పాత్రలు ‘వార్ 2’ చిత్రంలో కనిపించవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 14న వీటన్నింటికీ సమాధానం దొరుకుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రభాస్ చెల్లి చేసిన పనికి.. నిరాశలో రెబల్ స్టార్ ఫ్యాన్స్‌

మోహన్ బాబు పప్పు.. చరణ్ రసం! వావ్‌! వాటే కాంబినేషన్ గురూ

అర్హ క్యూట్ వీడియో.. అన్నయ్య‌ల‌కు రాఖీ కట్టి.. కాళ్లకు మొక్కిన బన్నీ త‌న‌య‌

కిరాతకంగా చంపి డెడ్‌ బాడీస్‌తో ఇల్లు కట్టుకోవడం ఏంట్రా? దిమాక్ ఖరాబ్ సినిమా..! బట్‌ ఫుల్ థ్రిల్‌!

గుడ్‌న్యూస్‌.. భారీగా దిగొచ్చిన బంగారం ధర.. తులం ఎంతంటే