Lock Down: గ్యాస్ సెగ.. మళ్లీ లాక్‌డౌన్ తప్పదా
దేశంలో గ్యాస్ సంక్షోభం గడప దాటి వీధిన పడింది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయుల వంటిళ్ల మీద కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇది కేవలం ఇంధన కొరత మాత్రమే కాదు, లక్షలాది మంది కార్మికుల పొట్ట కొడుతున్న సామాజిక విపత్తుగా మారుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతుండటంతో పరిస్థితి చూస్తుంటే.. భయానకమైన కరోనా లాక్‌డౌన్ రోజులు మళ్లీ కళ్లముందు కదలాడుతున్నాయి.
దేశంలో గ్యాస్ సంక్షోభం గడప దాటి వీధిన పడింది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయుల వంటిళ్ల మీద కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇది కేవలం ఇంధన కొరత మాత్రమే కాదు, లక్షలాది మంది కార్మికుల పొట్ట కొడుతున్న సామాజిక విపత్తుగా మారుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతుండటంతో పరిస్థితి చూస్తుంటే.. భయానకమైన కరోనా లాక్‌డౌన్ రోజులు మళ్లీ కళ్లముందు కదలాడుతున్నాయి. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఢిల్లీ, నోయిడా, హైదరాబాద్ వంటి మహానగరాల్లో హోటల్ రంగం కుదేలైంది. వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో వేలాది రెస్టారెంట్లు బోర్డులు తిప్పేస్తున్నాయి. దీంతో రెస్టారెంట్లలో పనిచేసే వెయిటర్లు, క్లీనర్లు, వంట మనుషులు ఉపాధి కోల్పోయి మళ్లీ తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. రోజువారీ కూలీపై ఆధారపడే కార్మికులకు పని లేకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేక ఆకలితో అలమటిస్తున్నారు. “అప్పుడు వైరస్ చంపింది.. ఇప్పుడు గ్యాస్ కొరత చంపుతోంది” అని ఓ కార్మికుడు ఆవేదన వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గ్యాస్ కొరతను అదునుగా చేసుకుని అక్రమ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. విరివిగా దొరికే వాణిజ్య సిలిండర్ ధర రూ.5,000 దాటినప్పటికీ, అది హోటళ్ల వారికి అందని ద్రాక్షగా మారుతోంది. మరోవైపు డొమెస్టిక్ గ్యాస్‌ను అక్రమంగా హోటళ్లకు మళ్లిస్తుండటంతో సామాన్య గృహిణులు కూడా వంట గ్యాస్ కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంధన రవాణా వ్యవస్థ స్తంభించడంతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ గ్యాస్ సంక్షోభం కేవలం ఆర్థిక వ్యవస్థనే కాకుండా, సామాన్యుడి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఇంధన నిల్వలను పునరుద్ధరించకపోతే, ఈ ‘ఇంధన లాక్‌డౌన్’ దేశాన్ని మరో భారీ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానంలో బీడీ తాగాడు.. కట్ చేస్తే.. ఇలా అయ్యాడు
చిలుక జోస్యం చెప్పే వ్యక్తి చేతిలో.. లక్షలు పోగొట్టుకున్న ఐటీ అధికారి
ఈమె అవతారం చూసి పిచ్చిది అనుకుంటున్నారా ?? కాదు గొప్ప సెలబ్రిటీ
అంత్యక్రియలకు ముందు అద్భుతం.. చితి పెడదాం అని తీసుకెళ్లారు.. ఈ లోపే తిరిగి లేచాడు
గ్యాస్ సెగ.. మళ్లీ లాక్‌డౌన్ తప్పదా
విమానంలో బీడీ తాగాడు.. కట్ చేస్తే.. ఇలా అయ్యాడు
చిలుక జోస్యం చెప్పే వ్యక్తి చేతిలో.. లక్షలు పోగొట్టుకున్న అధికారి
ఈమె అవతారం చూసి పిచ్చిది అనుకుంటున్నారా ?? కాదు గొప్ప సెలబ్రిటీ
చితి పెడదాం అని తీసుకెళ్లారు.. ఈ లోపే తిరిగి లేచాడు
కోతులకు భయం.. భక్తులకు అభయం !! హనుమంతుడి రూపంలో ఆశీస్సులు
ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ

