విమానంలో బీడీ తాగాడు.. కట్ చేస్తే.. ఇలా అయ్యాడు
ఢిల్లీ-గోవా ఆకాశ ఎయిర్ విమానంలో ప్రయాణికుడు టాయిలెట్‌లో బీడీ తాగిన ఘటన సంచలనం రేపింది. బీడీలు, లైటర్‌తో పట్టుబడిన ఆ ప్రయాణికుడిని గోవాలో పోలీసులు అరెస్ట్ చేశారు. తోటి ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించినందుకు భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసు నమోదు చేశారు. విమానంలో పొగతాగడం అత్యంత ప్రమాదకరమని, గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని అధికారులు హెచ్చరించారు.
విమాన ప్రయాణం అంటేనే ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. కానీ ఓ ప్రయాణికుడు మాత్రం ఏకంగా బీడీ కాల్చడంతో సిబ్బంది ఆగ్రహానికి గురయ్యారు. అతడి వద్ద బీడీలతో పాటు లైటర్‌ను చూసి సిబ్బంది షాకయ్యారు. ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఆకాశ విమానంలో ఆశిష్ అనే వ్యక్తి ప్రయాణించాడు. ప్రయాణ సమయంలో టాయిలెట్‌కు వెళ్లిన అతను.. అక్కడ బీడీ కాల్చాడు. వాష్‌రూమ్ నుంచి బీడీ పొగ, వాసన రావడం గమనించిన విమానయాన సిబ్బంది.. అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వెంటనే అతణ్ని తనిఖీ చేశారు. అతని బ్యాగ్‌లో బీడీలు, లైటర్ ఉన్నట్లు గుర్తించారు. అతడు వాష్‌రూమ్‌లో బీడీ తాగినట్లు గుర్తించి విమానం గోవాలో ల్యాండ్ అయ్యాక పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. భద్రతా అధికారుల కళ్లుగప్పి ప్రయాణికుడు నిషేధిత లైటర్‌ను విమానంలోకి ఎలా తీసుకువచ్చాడనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇతర ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించే లైటర్ వంటి వస్తువులను తీసుకువచ్చినందుకు అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. ఆశిష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిపై కేసు నమోదు చేశారు. సివిల్ ఏవియేషన్ చట్టాలను ఉల్లంఘించినట్లు గుర్తించి భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. విమానంలో పొగతాగడం చాలా ప్రమాదకరమని, అది తోటి ప్రయాణికులు, విమాన భద్రతకు ముప్పు కలిగిస్తుందని పోలీసులు తెలిపారు. గతంలో ఇలాగే టేకాఫ్ కావడానికి సిద్ధమవుతున్న విమానంలో ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగాడు. హైదరాబాద్‌కు చెందిన అహ్మద్ శంషాబాద్ నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్ లో అబుదాబికి వెళ్తున్నాడు. విమానం టేకాఫ్ తీసుకోవడానికి రెడీ అవుతుండగా అహ్మద్ రహస్యంగా సిగరెట్ తాగాడు. గమనించిన ఎయిర్‌హోస్టస్ విషయాన్ని పైలట్ దృష్టికి తీసుకెళ్లింది. అప్రమత్తమైన భద్రతాధికారులు అహ్మద్‌ను అరెస్టు చేసి పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు. ఎంతో క్షుణ్నంగా చేసే తనిఖీలను తప్పించుకుని అతను సిగరెట్‌తో విమానం ఎలా ఎక్కాడన్నది ప్రశ్నార్థకంగా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిలుక జోస్యం చెప్పే వ్యక్తి చేతిలో.. లక్షలు పోగొట్టుకున్న ఐటీ అధికారి
ఈమె అవతారం చూసి పిచ్చిది అనుకుంటున్నారా ?? కాదు గొప్ప సెలబ్రిటీ
అంత్యక్రియలకు ముందు అద్భుతం.. చితి పెడదాం అని తీసుకెళ్లారు.. ఈ లోపే తిరిగి లేచాడు
కోతులకు భయం.. భక్తులకు అభయం !! హనుమంతుడి రూపంలో ఆశీస్సులు
జీతం ఇవ్వలేదని.. ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ
విమానంలో బీడీ తాగాడు.. కట్ చేస్తే.. ఇలా అయ్యాడు
చిలుక జోస్యం చెప్పే వ్యక్తి చేతిలో.. లక్షలు పోగొట్టుకున్న అధికారి
ఈమె అవతారం చూసి పిచ్చిది అనుకుంటున్నారా ?? కాదు గొప్ప సెలబ్రిటీ
చితి పెడదాం అని తీసుకెళ్లారు.. ఈ లోపే తిరిగి లేచాడు
కోతులకు భయం.. భక్తులకు అభయం !! హనుమంతుడి రూపంలో ఆశీస్సులు
ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ
ఎర్రటి ఎండను సైతం లెక్కచేయని భక్తి..

