చిలుక జోస్యం చెప్పే వ్యక్తి చేతిలో.. లక్షలు పోగొట్టుకున్న ఐటీ అధికారి
ఓ కేటుగాడు చిలుక జోస్యం పేరిట బెంగళూరులోని ఓ IT అధికారికి లక్షల రూపాయలు, కిలోల బంగారం, వెండిని దోచేశాడు. అదృష్టాన్ని పదింతలు చేస్తానంటూ నమ్మించి ప్రత్యేక పూజలు చేయిస్తానని చెప్పాడు. పూజల సాకుతో అధికారి విలువైన వస్తువులు తీసుకుని మాయమయ్యాడు. మోసపోయానని గ్రహించిన అధికారి పోలీసులను ఆశ్రయించగా, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఓ కేటుగాడు చిలుక జోస్యం పేరిట IT అధికారికి కుచ్చుటోపీ పెట్టాడు. అదృష్టం పదింతలు అయ్యేలా చేస్తానని చెప్పి.. లక్షల రూపాయలు దోచేశాడు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని భారతి నగర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన వీ సత్యనారాయణ్ ఆదాయపన్ను శాఖలో నాన్ గెజిటెడ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సత్యనారాయణ్‌కు కొన్ని నెలల క్రితం ఫుట్‌పాత్‌పై చిలుక జోస్యం చెప్పే శేఖర్ తో పరిచయం ఏర్పడింది. చిలుక జోస్యం ద్వారా భవిష్యత్తు చెబుతానని, ప్రత్యేక పూజల ద్వారా అదృష్టాన్ని పదింతలు చేస్తానని శేఖర్ నమ్మించాడు. శేఖర్ మాటలు నమ్మిన సత్యనారాయణ్ పూజల కోసం మొదటి సారి 50 వేల రూపాయలు ఇచ్చాడు. పూజ జరిగినా సత్యనారాయణ్ జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు. పెద్ద పూజలు చేస్తే ఫలితం అద్భుతంగా ఉంటుందని శేఖర్ చెప్పాడు. పూజల కోసం ఇంట్లోని బంగారం, వెండి తీసుకురమ్మన్నాడు. పూజలు అయిపోయిన వెంటనే తిరిగి ఇస్తానన్నాడు. శేఖర్ మాటలు నమ్మిన సత్యనారాయణ్ 194 గ్రాముల బంగారం, 1.3 కేజీల వెండిని తీసుకెళ్లి ఇచ్చాడు. వారం రోజులు గడిచిపోయాయి. శేఖర్‌ను బంగారం, వెండి గురించి అడగ్గా.. పూజలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని చెప్పాడు. సత్యనారాయణ్‌కు అనుమానం వచ్చింది. శేఖర్ ఉండే శ్రీ సర్కిల్‌కు వెళ్లాడు. అక్కడ శేఖర్ కనిపించలేదు. మోసపోయానని గ్రహించిన సత్యనారాయణ్ పోలీసులను ఆశ్రయించాడు. శేఖర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈమె అవతారం చూసి పిచ్చిది అనుకుంటున్నారా ?? కాదు గొప్ప సెలబ్రిటీ
అంత్యక్రియలకు ముందు అద్భుతం.. చితి పెడదాం అని తీసుకెళ్లారు.. ఈ లోపే తిరిగి లేచాడు
కోతులకు భయం.. భక్తులకు అభయం !! హనుమంతుడి రూపంలో ఆశీస్సులు
జీతం ఇవ్వలేదని.. ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ
చిలుక జోస్యం చెప్పే వ్యక్తి చేతిలో.. లక్షలు పోగొట్టుకున్న అధికారి
ఈమె అవతారం చూసి పిచ్చిది అనుకుంటున్నారా ?? కాదు గొప్ప సెలబ్రిటీ
చితి పెడదాం అని తీసుకెళ్లారు.. ఈ లోపే తిరిగి లేచాడు
కోతులకు భయం.. భక్తులకు అభయం !! హనుమంతుడి రూపంలో ఆశీస్సులు
ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ
ఎర్రటి ఎండను సైతం లెక్కచేయని భక్తి..
క్షుద్రపూజల కలకలం.. శివారులో భయానక దృశ్యాలు !!

