మోహన్ బాబు పప్పు.. చరణ్ రసం! వావ్! వాటే కాంబినేషన్ గురూ
చిరు- మోహన్ బాబు మధ్య వివాదం ఇష్యూ ఎలా ఉన్నా.. వీరిద్దరి పిల్లలు మాత్రం చాలా కలివిడిగా ఉంటారు. చరణ్ మోహన్ బాబుకు.. మనోజ్ చిరుకు చాలా ఇంపార్టెన్స్ అండ్ గౌరవం ఇస్తుంటారు. అందులోనూ మోహన్ బాబు చరణ్‌తో ఫ్రెండ్ లాగే మజాకులు ఆడుతుంటారు. అలాంటి కొన్ని ఫోటోలతో ఆమధ్య వీరిద్దరూ వైరల్ కూడా అయ్యారు.
ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్‌ను పప్పూ – రసంతో పోలుస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. అవి కాస్తా అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఇక అసలు మ్యాటర్‌లోకి వెళితే.. కామియా జైన్ అనే ఫుడ్ ట్రావెల్ యూట్యూబర్ గతంలో మోహన్ బాబును ఇంటర్వ్యూ చేసింది. ఆయన ఇంట్లోని వంటకాలను రుచి చూస్తూ.. ఆయనతో సరదా సంభాషణ సాగించింది. ఈ క్రమంలోనే తనకు తన ఇంట్లో చేసే స్పెషల్ పప్పు చాలా ఇష్టం అంటూ చెప్పారు మోహన్ బాబు. తన ఇంట్లోని పప్పు కు.. మంచు వారి పప్పు అనే నేమ్ కూడా ఉందంటూ చెప్పి అప్పట్లో వైరల్ అయ్యారు. ఇక ఇదే కావ్య జైన్.. ఎట్ ప్రసెంట్ మెగాస్టార్ చిరు ఇంటికి కూడా వెళ్లారు. ఉపాసనను ఇంటర్వ్యూ చేశారు. ఈక్రమంలోనే ఉపాసన చరణ్‌కు రసం అంటే చాలా ఇష్టం అంటూ చెప్పారు. రసం ఉంటే చాలు.. చరణ్‌కు మరేది అవసరం లేదని.. రసం నా హబ్బీకి అంతిష్టం అంటూ ఓపెన్ అయ్యారు. ఒక్కోసారి అన్నం లేకపోయినా పర్లేదు రసాన్ని సూప్‌లాగా తాగేస్తాడంటూ రివీల్ చేశారు. అయితే ఈ పాయింట్ పట్టుకున్న కొంత మంది నెటిజన్లు.. మోహన్ బాబు పప్పు కర్రీతో.. చరణ్ రసాన్ని జతచేసి… ఈ ఇద్దరి కాంబినేషన్ అండ్ టేస్ట్ అదిరిపోయిందని కామెంట్ చేస్తున్నారు. ఈ రెండు వీరి టేస్ట్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇంకొందరైతే చెర్రీ – మోహన్ బాబు సిల్వర్ స్క్రీన్ పై కలిసి యాక్ట్ చేయాలంటూ తమ కామెంట్స్‌లో కోట్ చేస్తున్నారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందంటూ చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అర్హ క్యూట్ వీడియో.. అన్నయ్యలకు రాఖీ కట్టి.. కాళ్లకు మొక్కిన బన్నీ తనయ
కిరాతకంగా చంపి డెడ్ బాడీస్‌తో ఇల్లు కట్టుకోవడం ఏంట్రా? దిమాక్ ఖరాబ్ సినిమా..! బట్ ఫుల్ థ్రిల్!
గుడ్‌న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం ధర.. తులం ఎంతంటే
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

