బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని అనేక జిల్లాలు ప్రభావితం కానున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు.