Cinema : ఇదెక్కడి సినిమాలు రా బాబూ.. ఒక్కో సీన్‌కు గుండె హడల్.. ఒంటరిగా అస్సలు చూడలేరు..
హారర్ సినిమాలు చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. కానీ కొన్ని భయానక మూవీస్ మాత్రం ఒంటరిగా చూడాలంటే ఎంతో ధైర్యం ఉండాల్సిందే. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా మాత్రం ఆద్యంతం జనాలను ఆకట్టుకుంటాయి. ఈ సినిమాను ఒంటరిగా చూడాలంటే ఎంతో గుండె ధైర్యం ఉండాల్సిందే. ఇంతకీ ఈ సినిమాలు ఏంటో తెలుసా.. ?

హారర్ సినిమాలు చూసేందుకు ఇప్పుడు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఓటీటీలో ఈ జానర్ చిత్రాలకు ఎక్కువగా ఆదరణ లభిస్తుంది. అందుకే మేకర్స్ ఈ జానర్ సినిమాలు, వెబ్ సిరీస్ తెరకెక్కించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు జనాలు ఎక్కువగా భయానక కథలు, దెయ్యాలు, ఉత్కంఠభరితమైన కంటెంట్‌ను ఇష్టపడుతున్నారు. అలాంటి వారికోసమే ఇప్పుడు ఈ భయానక సిరీస్ గురించి తెలుసుకుందాం. ఈ వెబ్ సిరీస్ పేరు రస్కిన్ బాండ్ రాసిన పార్చయీ: ఘోస్ట్ స్టోరీస్. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ జీ5లో ప్రసారమయ్యే ఒక హారర్-థ్రిల్లర్ వెబ్ సిరీస్. దీనిని ప్రముఖ రచయిత రస్కిన్ బాండ్ రాసిన దెయ్యాల కథల ఆధారంగా రూపొందించబడింది. ఈ సిరీస్‌లో 12 ఎపిసోడ్‌లు ఉన్నాయి. అవి భిన్నమైనవి. ఒక్కో ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటాయి. దీనికి IMDbలో 5.8 రేటింగ్ ఉంది.
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..
అలాగే అంధర్ మాయ అనేది జీ5లో వచ్చే మొట్టమొదటి మరాఠీ హర్రర్ వెబ్-సిరీస్. ఇది 30 మే 2025న విడుదలైంది. ప్రతి సంవత్సరం కొంకణ్‌లోని పాత భవనంలో సమావేశమయ్యే ఖాటు కుటుంబం గురించి ఉంటుంది. అందులో బహిర్గతం కాని రహస్యాలు, వారసత్వంగా వచ్చిన శాపాలు, ప్రాణాంతక సంఘటనలు ఉన్నాయి. దీనికి IMDbలో 6.5 రేటింగ్ ఉంది.
ఇవి కూడా చదవండి : Cinema : 4 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తున్న మహేష్ బాబు సినిమా.. 75 కోట్లు పెడితే రూ.214 కోట్లు కలెక్షన్స్..
ఇవే కాకుండా.. IMDbలో 7 రేటింగ్ ఉన్న మూఢనమ్మకాల సిరీస్ ‘దాయన్’. నటి టిన్హా దత్తా , మోహిత్ మల్హోత్రా రూపొందించిన ఈ సిరీస్, చేతబడి, మంత్రగత్తెలు, కుటుంబాల మధ్య చీకటి సంబంధాలను తెలియజేస్తుంది. జీ5లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్, కథాంశంతో థ్రిల్, భయాన్ని మిళితం చేస్తుంది.
ఇవి కూడా చదవండి : Arundhathi: కొరియోగ్రాఫర్‌ను పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫ్రెండ్స్‌తో బ్యాచిలర్ పార్టీ..
ఇవి కూడా చదవండి : Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోన్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..








