Actress : ఒకప్పుడు టీవీ రిపోర్టర్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. అమ్మడు ఫాలోయింగ్ చూస్తే మతిపోవాల్సిందే..
బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. అందం, అభినయంతో ఇప్పుడు సినీరంగంలో చక్రం తిప్పుతున్న ఈ హీరోయిన్.. ఒకప్పుడు టీవీ రిపోర్టర్ గా పనిచేసింది. జర్నలిజం చదివి ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఓ ఛానల్లో ఉద్యోగం చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు పాన్ ఇండియా క్రేజీ హీరోయిన్. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

సినిమా గ్లామర్ ప్రపంచంలో ఆమె టాప్ హీరోయిన్లలో ఒకరు. నటనపై ఆసక్తితో ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలలో దూసుకుపోతుంది. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల మధ్య పెరిగిన ఆమె.. జర్నలిజం చదువు పూర్తి చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఓ ఛానల్లో రిపోర్టర్ గా జాబ్ చేసింది. కానీ నటనపై ఆసక్తి ఉన్న ఆమె.. న్యూస్ రూమ్ నుంచి చలనచిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేసేలా చేసింది. ఇప్పుడు సొంతంగా ద్వీపం, కోట్ల ఆస్తి ఉన్న హీరోయిన్ ఆమె. ఆ హీరోయిన్ మరెవరో కాదండి. జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఆగస్ట్ 12న 39వ పుట్టినరోజు జరుపుకుంది.
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..
జాక్వెలిన్ తండ్రి శ్రీలంకకు చెందినవారు. తల్లి మలేషియా. ఆమె బహ్రెయిన్‌లోని మనామాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే విభిన్న సంస్కృతి, సంప్రదాయల మధ్య పెరిగింది. సిడ్నీ విశ్వవిద్యాలయం నుండి మాస్ కమ్యూనికేషన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి శ్రీలంకకు తిరిగి వచ్చింది. అక్కడ ఆమె టెలివిజన్ రిపోర్టర్‌గా, లంక బిజినెస్ రిపోర్ట్ షోకు యాంకర్‌గా పనిచేసింది. 2006లో లాస్ ఏంజిల్స్‌లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలో తన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ మిస్ యూనివర్స్ శ్రీలంక కిరీటాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత 2009లో సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో వచ్చిన అలాడిన్ అనే ఫాంటసీ డ్రామాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
ఇవి కూడా చదవండి : Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోన్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..
ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమె ఐఫా స్టార్ డెబ్యూ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంది. 2011లో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ మర్డర్ 2 మూవీతో ఆమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. హౌస్‌ఫుల్ 2 (2012), రేస్ 2 (2013), మరియు కిక్ (2014) వంటి చిత్రాలతో హిట్లు అందుకుంది. జాక్వెలిన్ ఎక్కువగా స్పెషల్ పాటలతో ఫేమస్ అయ్యింది. అలాగే శ్రీలంకలో సొంతంగా ద్వీపం కొనుగోలు చేసిందట. జాక్వెలిన్ చివరిగా తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహించిన మల్టీస్టారర్ చిత్రం హౌస్‌ఫుల్ 5 లో కనిపించింది.
ఇవి కూడా చదవండి : Cinema : 4 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తున్న మహేష్ బాబు సినిమా.. 75 కోట్లు పెడితే రూ.214 కోట్లు కలెక్షన్స్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Arundhathi: కొరియోగ్రాఫర్‌ను పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫ్రెండ్స్‌తో బ్యాచిలర్ పార్టీ..




