Tollywood: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో.. మహేష్ బాబుతో సినిమా కోసం ఇలా..
సినీరంగంలో తమ నటనతో జనాల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంటారు. తక్కువ సమయంలోనే తమ ప్రతిభతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోస్తుంటారు. కొన్నాళ్లుగా సినిమా ప్రపంచంలో తమదైన ముద్ర వేసిన స్టార్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఈ హీరో ఒకరు. ఇంతకీ ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా.. ? రావు బహదూర్ గా రాబోతున్నాడు.

నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. వైవిధ్యమైన పాత్రలకు తన నటనతో ప్రాణం పోస్తూ సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. సహజ నటనతో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ హీరో.. ఇప్పుడు మరో ప్రయోగాత్మక సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇంతకీ ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా.. ? ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ హీరో ఇప్పుడు ఓ సినిమా కోసం గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? పైన ఫోటోలో కనిపిస్తున్న నటుడు మరెవరో కాదండి.. టాలీవుడ్ స్టార్ హీరో సత్యదేవ్.
ఇవి కూడా చదవండి : Ramya Krishna: రమ్యకృష్ణ కొడుకును చూశారా..? తనయుడితో కలిసి శ్రీవారి దర్శనం.. వీడియో వైరల్..
సత్యదేవ్… పాన్ ఇండియా సినీప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ‘రావు బహదూర్’ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ ప్లస్ ఎస్ మూవీస్, శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించిన జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సమర్పిస్తుంది. గతంలో మహేష్ బ్యానర్ నుంచి మేజర్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రావు బహదూర్ సినిమాకు మద్దతు అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?
తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంటుంది. అందులో సత్యదేవ్ పూర్తిగా గుర్తపట్టలేనంతగా మారిపోయి కనిపిస్తున్నారు. నెమలి ఆభరణంతో ఒంటినిండా బంగారంతో సత్యదేవ్ లుక్ అదిరిపోయింది. నిజానికి చెప్పాలంటే ముసలి రాజు గెటప్ లో అస్సలు గుర్తుపట్టలేనట్లుగా కనిపిస్తున్నారు. అనుమానం పెనుభూతం అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేశ్ మహా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో సత్యదేవ్, వెంకటేశ్ మహా కాంబోలో ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య అనే సినిమాను తీసుకువస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Suriya: ఏముందిరా.. అందమే అచ్చు పోసినట్లు.. సూర్య కూతురిని చూశారా.. ?
Coming to you as A never before Mental Mass 𝗥𝗔𝗢 𝗕𝗔𝗛𝗔𝗗𝗨𝗥
Crafted by the genius @mahaisnotanoun @GMBents @SrichakraasEnts @AplusSMovies @Mahayana_MP #summer2026 @RaoBahadurMovie #RaoBahadur pic.twitter.com/Vgx58h50g4
— Satya Dev (@ActorSatyaDev) August 12, 2025
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..








