- Telugu News Photo Gallery Cinema photos Anupama Parameswaran Intresting Comments About Tillu Square Movie In Parada film Promotions
Anupama Parameswaran: ఆ సినిమా అంత కంఫర్ట్‌గా అనిపించలేదు.. ఓ ఛాలెంజ్‌లా తీసుకున్నా.. అనుపమ..
అనుపమ పరమేశ్వరన్.. తెలుగు సినీప్రియులకు ఎంతో ఇష్టమైన హీరోయిన్. ముఖ్యంగా కుర్రాళ్ల ఆరాధ్య దేవత. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ కేరళ చిన్నది. ఇప్పుడు పరదా మూవీతో అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉంటుంది.
Updated on: Aug 12, 2025 | 3:46 PM

అనుపమ పరమేశ్వరన్.. ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని హీరోయిన్. ప్రేమమ్ సినిమాతో మలయాళంలో నటిగా సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఎక్కువగా తెలుగులోనే సినిమాలు చేసింది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరించింది.

అంతేకాదు.. ఈ అమ్మడు ఎక్కువగా హోమ్లీ పాత్రలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెద్దగా గ్లామర్ షో చేయకుండా కర్లీ హెయిర్.. చూడచక్కని అందం.. సహజ నటనతో జనాలను కట్టిపడేసింది. కానీ కెరీర్ మొత్తంలో మొదటిసారి టిల్లు స్క్వేర్ సినిమమతోత తనలోని కొత్త యాంగిల్ పరిచయం చేసింది.

ఇందులో గ్లామరస్ పాత్రలో.. స్కర్ట్స్ వేసుకుని.. లిప్ లాక్ సీన్లలో కనిపించేసరికి అభిమానులు షాకయ్యారు. అనుపమ ఇలాంటి పాత్రలో కనిపించడమేంటీ అని ఆశ్చర్యపోయారు. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది అనుపమ. ఆమె నటించిన పరదా ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది.

టిల్లు స్క్వేర్ సినిమా సమయంలో తాను అంతగా కంఫర్ట్ లేరన్న విషయాన్ని బయటపెట్టింది. తన అభిమానులకు అలాంటి పాత్ర చేయడం నచ్చలేదని.. ఆ సినిమాలో చేసిన క్యారెక్టర్ ఒప్పుకోవడానికి చాలా టైమ్ పడ్డిందని.. చెయ్యాలా వద్దా అని చాలాసార్లు ఆలోచించానని తెలిపింది.

సెట్ కు వెళ్లి 100 శాతం కాన్ఫిడెంట్ గా లేకుండా చేసిన సినిమా అది.. కానీ సినిమాలో గానీ.. ప్రమోషన్లలో గానీ ఆ డ్రెస్సులు వేసుకోవడం అంతగా కంఫర్ట్ గా అనిపించలేదు. వేర్వేరు సినిమాల్లో చేసినట్లే ఇది ఓ ఛాలెంజ్ లా అనిపించింది. ఆ పాత్ర చాలా బలమైనదని భావించాను. సినిమా రిలీజ్ అయ్యాక కూడా హీరోకు సమానంగా ఉందని అన్నారు అంటూ చెప్పుకొచ్చింది.




