AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫలించిన ప్రధాని మోదీ దౌత్య వ్యూహం.. హార్మూజ్‌ జలసంధిని దాటిన భారత ఎల్పీజీ ట్యాంకర్‌!

భారతదేశ ప్రజలు ఇది ఒక గుడ్‌న్యూస్.. దీంతో LPG గ్యాస్ కొరత తీరినట్లే.. 40,000 మెట్రిక్ టన్నుల LPGని మోసుకొస్తున్న భారతీయ నౌక శివాలిక్ ఇరాన్‌లోని హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తోంది. భారత నావికాదళ యుద్ధనౌకలు శివాలిక్ ఓడ చుట్టూ రక్షణగా ఉన్నాయి. మీడియా నివేదిక ప్రకారం, శివాలిక్ తర్వాత మరో LPG నిండిన ఓడ హార్ముజ్ జలసంధిని దాటనుంది.

ఫలించిన ప్రధాని మోదీ దౌత్య వ్యూహం.. హార్మూజ్‌ జలసంధిని దాటిన భారత ఎల్పీజీ ట్యాంకర్‌!
Indian Shivalik Laden
Balaraju Goud
|

Updated on: Mar 14, 2026 | 10:25 AM

Share

భారతదేశ ప్రజలు ఇది ఒక గుడ్‌న్యూస్.. దీంతో LPG గ్యాస్ కొరత తీరినట్లే.. 40,000 మెట్రిక్ టన్నుల LPGని మోసుకొస్తున్న భారతీయ నౌక శివాలిక్ ఇరాన్‌లోని హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తోంది. భారత నావికాదళ యుద్ధనౌకలు శివాలిక్ ఓడ చుట్టూ రక్షణగా ఉన్నాయి. మీడియా నివేదిక ప్రకారం, శివాలిక్ తర్వాత మరో LPG నిండిన ఓడ హార్ముజ్ జలసంధిని దాటనుంది.

హార్ముజ్ జలసంధిని దాటిన తర్వాత, ఈ నౌక రెండు రోజుల్లో భారతదేశానికి చేరుకుంటుందని సమాచారం అందుతోంది. దీని తరువాత, LPG నిండిన అనేక నౌకలు భారతదేశానికి బయలుదేరుతాయి. అవన్నీ ఇరాన్ నుండి అనుమతి పొందాయి. ఇది భారత ప్రజలకు పెద్ద ఉపశమనం. అంతకుముందు, ప్రధానమంత్రి మోదీ ఈ విషయంపై ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడారు. ఇద్దరు నాయకుల మధ్య సానుకూల సంభాషణ తర్వాతే ఇరాన్ భారత నౌకలను హార్ముజ్ జలసంధిని దాటడానికి అనుమతించింది. శివాలిక్ షిప్ వంటి ఇతర నౌకలు త్వరలో భారతదేశానికి చేరుకుంటాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

యుఎఇ సమీపంలోని మినా సకర్ ఓడరేవు ప్రాంతంలో ఒక భారతీయ ఓడ లంగరు వేసి ఉంది. ఆ ఓడలో ఎల్‌పిజి గ్యాస్ ట్యాంకర్ ఉంది. ఈ ట్యాంకర్ 3.6 మిలియన్ గ్యాస్ సిలిండర్లను నింపగలదు. అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఓడ కెప్టెన్ వీరేంద్ర సహా, సిబ్బంది ఇక్కడే చిక్కుకుపోయారు. ఓడ కువైట్‌లోని మినా అల్ అహ్మది ఓడరేవు నుండి గుజరాత్‌లోని దీన్‌దయాళ్ కాండ్లా ఓడరేవుకు బయలుదేరింది. ఫిబ్రవరి 28 నుండి, ఓడ యుఎఇ సమీపంలోని మినా సకర్ ఓడరేవు ప్రాంతంలో లంగరు వేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి, నావికాదళానికి కెప్టెన్ వీరేంద్ర బృందాన్ని సురక్షితంగా తిరిగి రావాలని కెప్టెన్ వీరేంద్ర కుటుంబం విజ్ఞప్తి చేసింది.

ఇదిలావుంటే, గత వారం రోజులుగా దేశం ఎల్‌పిజి గ్యాస్ కొరతను ఎదుర్కొంటోంది. గ్యాస్ ఏజెన్సీల వెలుపల ప్రజలు పొడవైన క్యూలు కనిపించాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి గ్యాస్ కొరత గురించి ఇప్పటికీ వెలువడుతున్నాయి. అయితే, భారత ప్రభుత్వం మొదట్లో గ్యాస్ కొరతను ఖండించింది. అలాంటి పరిస్థితి తలెత్తలేదని ప్రజలకు హామీ ఇచ్చింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ, తప్పుడు సమాచారం భయాందోళనలకు గురిచేసి బుకింగ్, నిల్వలకు దారితీసిందని పేర్కొన్నారు. సగటు దేశీయ ఎల్‌పిజి డెలివరీ దాదాపు రెండున్నర రోజులు మాత్రమే అని పేర్కొన్నారు.

గ్యాస్ అక్రమ మళ్లింపును నివారించడానికి డెలివరీ అథెంటికేషన్ కోడ్ (DAC) వ్యవస్థను అమలు చేసినట్లు జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. ఈ వ్యవస్థ కింద, వినియోగదారులు తమ సిలిండర్లను స్వీకరించడానికి డెలివరీ వ్యక్తికి ఒక కోడ్‌ను అందించాలి. డిమాండ్‌ను నిర్వహించడానికి తాత్కాలిక చర్యగా, LPG బుకింగ్‌ల మధ్య కనీస విరామం 21 రోజుల నుండి 25 రోజులకు పెంచారు. ముడి చమురు విషయానికొస్తే, పరిస్థితి చాలా బాగుందని సుజాత శర్మ పేర్కొన్నారు.

మరిన్ని అంతర్జాతీ యవార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?