Watch: చైనా అంతరిక్ష ప్రయోగంలో బిగ్ షాక్.. 85 సెకన్లకే గాలిలోనే పేలిపోయిన రాకెట్!
చైనా అంతరిక్ష ప్రయోగంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. చైనా-శాట్-4బి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ప్రయోగించిన లాంగ్ మార్చ్-7ఏ రాకెట్ ప్రయోగించిన కొద్దిసేపటికే విఫలమైంది. సోమవారం (ఆగస్టు 09) రాత్రి దక్షిణ చైనాలోని వెంచాంగ్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే సుమారు 85 సెకన్ల తర్వాత రాకెట్‌లో పేలుడు సంభవించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో కనిపించింది.

బీజింగ్ కాలమానం ప్రకారం రాత్రి 8.02 గంటలకు ప్రయోగం ప్రారంభమైంది. ప్రయోగం అనంతరం రాకెట్‌లో అసాధారణ పరిస్థితి తలెత్తిందని చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది. అనంతరం మిషన్ విఫలమైనట్లు వెల్లడించింది. సాంకేతిక లోపానికి అసలు కారణం ఏమిటనేది ప్రస్తుతం విశ్లేషిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
చైనా జాతీయ రేడియో తొలుత ప్రయోగానికి సంబంధించిన సమాచారాన్ని ప్రసారం చేసినప్పటికీ.. ఆ కథనం అనంతరం అందుబాటులో లేకుండా పోయినట్లు సమాచారం. ఈ ఘటనపై చైనా అంతరిక్ష అధికారులు ఇంకా సమగ్ర అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.
2020 తర్వాత లాంగ్ మార్చ్-7ఏకు ఇదే తొలి వైఫల్యంగా భావిస్తున్నారు. 2020లో తొలి ప్రయోగం విఫలమైన అనంతరం 2021 నుంచి ఈ రాకెట్ వరుస విజయవంతమైన ప్రయోగాలను పూర్తి చేసింది. ఇటీవల జూలైలో టియాన్లియన్-3 (01) ఉపగ్రహాన్ని కూడా ఇదే రాకెట్ విజయవంతంగా ప్రయోగించింది.
లాంగ్ మార్చ్-7ఏను ప్రధానంగా ఉపగ్రహాలను జియోసింక్రోనస్ కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఉపయోగిస్తారు. పాత లాంగ్ మార్చ్-3బీకి ప్రత్యామ్నాయంగా దీన్ని అభివృద్ధి చేశారు. తాజా వైఫల్యం చైనా అంతరిక్ష రంగానికి గట్టి ఎదురుదెబ్బగా మారింది.
వీడియో ఇక్కడ చూడండి..
WATCH: China’s Long March 7A rocket explodes seconds after launch pic.twitter.com/6kfUzKJoSz
— Rapid Report (@RapidReport2025) August 10, 2026
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..