AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!

అదృష్టం ఎప్పుడు, ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. దుబాయ్‌లో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్న పంజాబ్‌కు చెందిన 53 ఏళ్ల కుల్వంత్ సింగ్‌కు ఏకంగా రూ.1.3 కోట్ల లాటరీ తగిలింది. ఈ మొత్తాన్ని ఐదుగురు స్నేహితులతో కలిసి పంచుకోనున్నారు. అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో వీరు 5 లక్షల దిర్హామ్‌లు (సుమారు రూ.1.3 కోట్లు) గెలుచుకున్నారు. తన వాటాగా వచ్చే డబ్బును కుటుంబ అవసరాలకు, ఇంటి కోసం ఉపయోగించాలని కుల్వంత్ సింగ్ భావిస్తున్నారు.

దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!
Dubai Truck Driver From Punjab Wins Lottery With Five Friends
Sharada V
|

Updated on: Oct 13, 2026 | 8:25 PM

Share

కుల్వంత్ సింగ్ దుబాయ్‌లోని జెబెల్ అలీలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. అబుదాబి బిగ్ టికెట్ గురించి తెలుసుకుని రెండేళ్లుగా ఐదుగురు స్నేహితులతో కలిసి ప్రతి నెలా టికెట్లు కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఆరుగురు కలిసి టికెట్ కొనుగోలు చేశారు. ఈసారి కుల్వంత్ సింగ్ యాదృచ్ఛికంగా ఓ నంబర్‌ను ఎంచుకున్నారు. అదే వారికి అదృష్టాన్ని తీసుకొచ్చింది. డ్రాలో 5 లక్షల దిర్హామ్‌ల బహుమతి గెలుచుకున్నట్లు తెలియగానే అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

‘ మేం ప్రతి నెలా కలిసి టికెట్లు కొంటున్నాం. చివరికి విజయం సాధించామని తెలిసి ఎంతో సంతోషపడ్డాం’ అని కుల్వంత్ సింగ్ చెప్పారు. లాటరీలో గెలిచిన 5 లక్షల దిర్హామ్‌లను ఆరుగురు స్నేహితులు పంచుకోనున్నారు.  కుల్వంత్ సింగ్‌కు మొత్తం బహుమతిలో కొంత వాటా వస్తుంది. ఆ డబ్బును ఇంటి కోసం ఖర్చు చేయాలని భావిస్తున్నాననీ భవిష్యత్తులోనూ బిగ్ టికెట్ డ్రాల్లో పాల్గొనాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

కొడుకు పుట్టినరోజు నంబర్‌తో మరో భారతీయుడికి అదృష్టం

తాజా బిగ్ టికెట్ డ్రాలో కేరళకు చెందిన 30 ఏళ్ల ఇంజినీర్ మహమ్మద్ ఇజాస్ సి కూడా బహుమతి గెలుచుకున్నారు. ఆయనకు లక్ష దిర్హామ్‌లు (సుమారు రూ.26 లక్షలు) లభించాయి. గత ఏడేళ్లుగా కుటుంబంతో కలిసి అజ్మాన్‌లో నివసిస్తున్న ఇజాస్‌కు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా ఆరు నెలల క్రితం బిగ్ టికెట్ గురించి తెలిసింది. అప్పటి నుంచి పది మందితో కూడిన బృందంతో కలిసి టికెట్లు కొన్నారు. ఈసారి కుమారుడి పుట్టినరోజు, పుట్టిన సంవత్సరానికి సంబంధించిన నంబర్‌ను ఎంచుకున్నారు. అదే నంబర్‌కు బహుమతి రావడంతో ఆయన ఆనందం మరింత పెరిగింది. తనకు వచ్చిన డబ్బును కుమారుడి కోసం ఖర్చు చేయాలనుకుంటున్నట్లు ఇజాస్ తెలిపారు.

మరో భారతీయుడికి రూ.26 లక్షలు

సెట్వాన్ కుమార్ చౌహాన్ అనే మరో భారతీయ ప్రవాసికి కూడా లక్ష దిర్హామ్‌లు (సుమారు రూ.26 లక్షలు) బహుమతిగా వచ్చింది. కేరళకు చెందిన 54 ఏళ్ల అజిత్ కుమార్ వన్నరత్‌కు కూడా ఈ డ్రాలో అదృష్టం కలిసొచ్చింది. గత పదేళ్లుగా ఒమన్‌లో డాక్యుమెంట్ కంట్రోలర్‌గా పనిచేస్తున్న అజిత్‌కు 2.5 లక్షల దిర్హామ్‌లు (సుమారు రూ.65 లక్షలు) బహుమతిగా వచ్చాయి. దాదాపు పదేళ్లుగా బిగ్ టికెట్ డ్రాల్లో పాల్గొంటున్న అజిత్ ఈసారి యాదృచ్ఛికంగా ఎంచుకున్న నంబర్‌కు బహుమతి రావడంతో సంతోషించారు. మరో ఐదుగురు భారతీయులు కలిసి రూ.5 కోట్లకు పైగా బహుమతులు గెలుచుకున్నారు. సిరీస్ 291లో భాగంగా కన్సొలేషన్ బహుమతులు గెలుచుకోగా 19.5 లక్షల దిర్హామ్‌లు (సుమారు రూ.5 కోట్లకు పైగా) లభించాయి.

Follow Us
దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!
దుబాయ్‌లో పంజాబీ ట్రక్ డ్రైవర్‌కు రూ.1.3 కోట్ల లాటరీ..!
అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!
అందమైన జా లైన్ కోసం సులువైన చిట్కాలు.. ముఖంపై కొవ్వుకు చెక్!
విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..
విజయవాడ ఉత్సవ్‌లో చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్‌..
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!
దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా
దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా
ఇడ్లీ, దోశ పిండిలో ఇదొక్కటి వేస్తే జరిగే మ్యాజిక్కే వేరు..
ఇడ్లీ, దోశ పిండిలో ఇదొక్కటి వేస్తే జరిగే మ్యాజిక్కే వేరు..
సోఫా కింద ఉంచిన పింగాణీ పళ్లానికి వేలంలో కళ్లు చెదిరే ధర!
సోఫా కింద ఉంచిన పింగాణీ పళ్లానికి వేలంలో కళ్లు చెదిరే ధర!
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే?
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే?
గౌతమ్ రాజు ఆ జబ్బుతో బాధపడుతున్నారా?స్వయంగా క్లారిటీ ఇచ్చిన నటుడు
గౌతమ్ రాజు ఆ జబ్బుతో బాధపడుతున్నారా?స్వయంగా క్లారిటీ ఇచ్చిన నటుడు
ధర తక్కువ.. ఉపయోగం ఎక్కువ.. చలికాలంలో ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్‌..!
ధర తక్కువ.. ఉపయోగం ఎక్కువ.. చలికాలంలో ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్‌..!