- Telugu News Photo Gallery Cinema photos Manchu Lakshmi participated in the cow worship under the auspices of ISKCON
గో పూజలో మంచు లక్ష్మీ.. ఫొటోస్ వైరల్
ఇస్కాన్ ఆధ్వర్యంలో గోమాత పూజలో మంచు లక్ష్మీ పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ నివాసంలో జరిగిన ఈ పూజకు మంచు లక్ష్మీ హాజరై గోమాతకు పూజలు చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోస్ చూసెయ్యండి.
Updated on: Aug 13, 2025 | 3:25 PM

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మోహన్ బాబు కూతరు, నటి మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ముద్దుగుమ్మల్లో ఈ బ్యూటీ ఒకరు. అంతే కాకుండా నిత్యం ఏదో ఇక వీడియో షేర్ చేస్తూ తన అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటుంది.

ఈ చిన్నది అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టి మొదటి మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ బ్యూటీ ఈ మూవీలో తన నటనకు గాను, నందీపురస్కారం అందుకుంది.

ఇక ఈ మూవీ తర్వాత వరసగా సినిమాలు చేసి, తన నటనతో అందరి మనసు దోచేసింది. ప్రస్తుం సినిమాల్లో నటించడం కంటే, నిర్మాతగా మారి ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది.

మంచు లక్ష్మీ తెలుగులోనే కాకుండా తమిళ్ , మళయాలం వంటి భాషల్లో కూడా నటించింది. విలన్ పాత్రల్లో కూడా నటించి, తన నటనతో అందరినీ మెప్పించింది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోస్ షేర్ చేసే ఈ ముద్దుగుమ్మ, తాజాగా మంత్రి కొండా సురేఖ నివాసంలో ఇష్కాన్ ఆధ్వర్యంలో గోమాత పూజలు చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.



