Shruti Haasan : బ్లాక్ కలర్ సెంటిమెంట్ రివీల్ చేసిన శ్రుతిహాసన్.. అసలు విషయం ఇదే..
లోకనాయకుడు కమల్ హాసన్ నటవారసురాలిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ శ్రుతి హాసన్. తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ, అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. చివరగా సలార్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు కూలీ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Updated on: Aug 13, 2025 | 3:11 PM

హీరోయిన్ శ్రుతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. చివరగా సలార్ చిత్రంలో కనిపించిన శ్రుతిహాసన్.. ఇప్పుడు కూలీ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది.

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా మరికొన్ని గంటల్లో అడియన్స్ ముందుకు రానుంది. ఇందులో శ్రుతిహాసన్ సైతం కీలకపాత్ర పోషిస్తుంది. ఆగస్ట్ 14న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రుతిహాసన్.. తనకున్న బ్లాక్ కలర్ సెంటిమెంట్ గురించి అసలు విషయం చెప్పుకొచ్చింది. తనకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టమని.. చాలా మంది ఈ రంగును అశుభంగా భావిస్తారని.. కానీ తనకది శుభంగానే అనిపిస్తుందని చెప్పుకొచ్చింది.

బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఎంతో కాన్ఫిడెంట్ గా కనిపిస్తానని.. నలుగురిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తామని.. అలాగే తన స్కిన్ టోన్ కు తగ్గట్టుగా బ్లాక్ కలర్ చాలా పర్ఫెక్ట్ గా అనిపిస్తుందని తెలిపింది. బ్లాక్ కలర్ దుస్తులు వేసుకుని బయటకు వెళ్లినప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటామని తెలిపింది.

ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే శ్రుతిహాసన్.. రోజుకో పోస్ట్ చేస్తుంటుంది. అయితే ఆమె ఎప్పుడూ బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ లో ఫోటోషూట్స్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తుంది. చాలా వరకు ఈ అమ్మడు చేసిన ఫోటోషూట్స్ మొత్తం నలుపు రంగు దుస్తులలో ఉండడం గమనార్హం.




