- Telugu News Photo Gallery Cinema photos Can You Guess This Actress In This Childhood Photo, She Is Heroine Trisha
Actress : అబ్బబ్బ.. ఏం అందం రా బాబూ.. 42 ఏళ్ల వయసులో టెన్షన్ పుట్టిస్తోన్న వయ్యారి..
దశాబ్దాలుగా సినీరంగంలో రాణిస్తున్న హీరోయిన్.. ఇప్పుడిప్పుడే స్టార్ స్టేటస్ అందుకుంటున్న ముద్దుగుమ్మలకు టెన్షన్ పుట్టిస్తోంది. 42 ఏళ్ల వయసులో ఏమాత్రం తరగని అందంతో కట్టిపడేస్తుంది. ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?
Updated on: Aug 07, 2025 | 9:05 PM

కెరిర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఆ తర్వాత హీరోయిన్ గా మారి.. కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. చిన్న సినిమాలనుంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఇప్పుడు హీరోలకు ధీటుగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. తెలుగు, తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తుంది.

తెలుగు, తమిళ్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పి్స్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఇంకెవరు కుర్రాళ్ల దిల్ క్రష్ త్రిష. చెన్నైకి చెందిన ఈ ముద్దుగుమ్మకు వర్షం సినిమాతో తెలుగులో బ్రేక్ వచ్చింది. ప్రభాస్, ఎన్టీఆర్, వెంకటేశ్, చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో నటించింది.

ఇటీవలే పొన్నియన్ సెల్వన్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. 42 ఏళ్ల వయసులోనూ అందంతో కట్టిపడేస్తుంది. ముఖ్యంగా లుక్, ఫిట్నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇటీవలే థగ్ లైఫ్ సినిమాతో అలరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి జోడిగా విశ్వంభర చిత్రంలో నటిస్తుంది.

ప్రస్తుతం తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు.. ముఖ్యంగా సీనియర్ హీరోలకు జోడిగా కనిపిస్తుంది. అంతేకాదు.. ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటూ స్టార్ హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా త్రిష లేటేస్ట్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

కెరిర్ తొలినాళ్లల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి సైడ్ ఆర్టిస్టుగా కనిపించింది. ఆ తర్వాత కథానాయికగా మారింది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. ప్రేమ, పెళ్లికి దూరంగా ఉంటూ ఒంటరిగా ఉంటుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.




