AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..

భారతీయ సినిమా ప్రపంచంలో ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ జోరు కొనసాగుతుంది. దశాబ్దాలుగా సినీరంగంలో ఎన్నో సూపర్ హిట్లతో సత్తా చాటిన ముద్దుగుమ్మలు.. ఇప్పటికీ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అంతేకాదు.. ఇప్పుడు 40 ఏళ్లు దాటిన హీరోయిన్స్ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటూ కుర్రభామలకు చుక్కలు చూపిస్తున్నారు.

Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..
Nayanthara
Rajitha Chanti
|

Updated on: Aug 13, 2025 | 4:30 PM

Share

ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో సీనియర్ హీరోయిన్స్ సత్తా చాటుతున్నారు. బ్యాక్ టూ బ్యాక్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. అగ్ర హీరోలతో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. ఇక ఇప్పుడు స్టార్ హీరోలకు పోటీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కొందరు ముద్దుగుమ్మలు మాత్రం హీరోలకు మించిన పారితోషికం తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీని 40 ఏళ్లు దాటిన హీరోయిన్లు శాసిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా పాతికేళ్ల ఫిట్నెస్, బ్యూటీఫుల్ లుక్స్ తో కట్టిపడేస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్ త్రిష వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదున్న సంగతి తెలిసిందే. 42 ఏళ్ల వయసులో ప్రేమ, పెళ్లికి దూరంగా ఉంటూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఓ హీరోయిన్ మాత్రం కేవలం 50 సెకండ్స్ సీన్ కోసమే ఏకంగా రూ.5 కోట్లు వసూలు చేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదు.హీరోయిన్ నయనతార.

ఇవి కూడా చదవండి : Arundhathi: కొరియోగ్రాఫర్‏ను పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫ్రెండ్స్‏తో బ్యాచిలర్ పార్టీ..

ఇవి కూడా చదవండి

లేడీ సూపర్ స్టార్ నయనతార.. తెలుగు, తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ అమ్మడు.. ఇప్పుడు మాత్రం వరుస సినిమాలతో స్టార్ డమ్ సంపాదించుకుంది. కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో యాక్టివ్ గా ఉంటుంది. రజినీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్ వంటి పాన్ ఇండియా స్టార్ హీరోలతో నటించింది. ఇటీవలే షారుఖ్ ఖాన్ సరసన జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా దాదాపు 1000 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న కొత్త సినిమాలో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి : Cinema : 4 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తున్న మహేష్ బాబు సినిమా.. 75 కోట్లు పెడితే రూ.214 కోట్లు కలెక్షన్స్..

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం స్టార్ హీరోలకు పోటీగా రెమ్యునరేషన్ వసూలు చేస్తున్న హీరోయిన్ నయనతార. ఒక్కో సినిమాకు ఆమె రూ.15 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే గతంలో ఓ 50 సెకన్ల టీవీ యాడ్ కోసం రూ.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుందట. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇది హై ఎండోర్స్మెంట్ డీల్ అని ప్రచారం జరిగింది. కేవలం 50 సెకన్ల టీవీ యాడ్ కోసం ఈ స్థాయిలో పారితోషికం తీసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. నివేదికల ప్రకారం నయనతార ఆస్తులు రూ.200 కోట్లు.

ఇవి కూడా చదవండి : Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోన్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 సెలబ్రెటీల జాబితాలో చేటు సంపాదించుకున్న ఏకైక సౌత్ ఇండియన్ హీరోయిన్ నయనతార కావడం విశేషం. దాదాపు 20 ఏళ్ల సినీప్రయాణంలో ఇప్పటివరకు 75కి పైగా సినిమాల్లో నటించింది. అటు వ్యాపారరంగంలోనూ రాణిస్తుంది.

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ