AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధోని ఎలాంటోడంటే.. రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె

ఎంఎస్ ధోనీ ఎంత గొప్ప కెప్టెనో అంతే సాధారణ వ్యక్తి కూడా అని అజింక్యా రహానే తెలిపారు. ధోనీ గది తలుపు ఎప్పుడూ తెరిచే ఉండేదని, ఎవరైనా వెళ్లి క్రికెట్ గురించి మాట్లాడొచ్చని చెప్పారు. సీనియర్, జూనియర్ తేడా లేకుండా అందరినీ కలుపుకొని వెళ్లే నాయకుడని ప్రశంసించారు.

ధోని ఎలాంటోడంటే..  రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె
Ajinkya Rahane And Ms Dhoni
SN Pasha
|

Updated on: Aug 05, 2026 | 4:37 PM

Share

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వ్యక్తిత్వంపై టీమిండియా బ్యాటర్ అజింక్యా రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మైదానంలో ఎంత ప్రశాంతంగా ఉంటారో, మైదానం వెలుపల కూడా అంతే సాధారణ వ్యక్తిగా ధోనీ ఉంటారని చెప్పారు. “ధోనీ చాలా సాధారణ మనిషి. అతను ఎప్పుడూ ప్రశాంతంగా, కూల్‌గా ఉంటాడు. అతని గది తలుపు ఎప్పుడూ తెరిచే ఉండేది. ఎవరైనా లోపలికి వచ్చి క్రికెట్ గురించి మాట్లాడవచ్చు, సరదాగా గడపవచ్చు అనే సంకేతాన్ని ఆయన అలా ఇచ్చేవారు” అని రహానే తెలిపారు.

అంతేకాదు కొన్నిసార్లు ధోనీ గదిలో ఒకేసారి 10 నుంచి 15 మంది ఆటగాళ్లు ఉండేవారని, కొన్ని సందర్భాల్లో మొత్తం జట్టే అక్కడ చేరి సరదాగా గడిపేదని ఆయన గుర్తు చేసుకున్నారు. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరినీ ఒకేలా చూసే నాయకత్వ లక్షణం ధోనీలో ప్రత్యేకమని రహానే ప్రశంసించారు. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం, సహచర ఆటగాళ్లకు అందుబాటులో ఉండటం, స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించడం ధోనీని గొప్ప నాయకుడిగా నిలబెట్టిన ముఖ్యమైన లక్షణాలని రహానే పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా రహానె ఇటీవలె అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్‌కు సైతం రహానె ఆడాడు. ఓపెనర్‌గా అద్భుతమైన ఆరంభాలు అందిస్తూ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. అలాగే టీమిండియాలో కూడా ధోని, రహానె కలిసి చాలా మ్యాచ్‌లు ఆడారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us