Vivo Y600i.. కళ్ళుచెదిరే ఫీచర్లు, మతిపోగొట్టే కెమెరా.. ధర ఇంత తక్కువా?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో Y600 సిరీస్‌లో కొత్త మొబైల్‌ను విడుదల చేసింది. vivo Y600i పేరుతో వచ్చిన ఈ ఫోన్ బడ్జెట్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుంది. భారీ 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో పాటు IP68+IP69 రక్షణను అందించారు. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికి అనుగుణంగా దీన్ని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

కెమెరా విషయంలో వెనుక భాగంలో 50MP ప్రధాన సెన్సార్ ఇచ్చారు. ముందు భాగంలో 8MP కెమెరా ఉంటుంది. రోజువారీ వినియోగంలో ఫోన్‌కు మెరుగైన రక్షణ కల్పించేందుకు SGS గోల్డ్ స్టాండర్డ్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కూడా పొందింది. ప్రస్తుతం ఈ మొబైల్ చైనా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో విడుదలపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు.
120Hz డిస్‌ప్లే..
vivo Y600iలో 6.87 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను అందించారు. ఇది 1592×720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. గరిష్ఠంగా 1,300 నిట్స్ HBM బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. పనితీరు కోసం 4nm Snapdragon 4 Gen 2 Mobile Platformను ఉపయోగించారు. ఇందులో రెండు పనితీరు కోర్లు 2.2GHz వరకు, ఆరు ఎఫిషియెన్సీ కోర్లు 2GHz వరకు పనిచేస్తాయి. గ్రాఫిక్స్ కోసం Adreno 613 GPU ఉంది.
6GB LPDDR4X RAMతో వచ్చిన ఈ ఫోన్‌లో 128GB, 256GB UFS 2.2 స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. Android 16 ఆధారిత OriginOS 6పై పనిచేస్తుంది. సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, USB Type-C, 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11ac, Bluetooth 5.1 వంటి కనెక్టివిటీ సదుపాయాలు ఉన్నాయి.
8,000mAh బ్యాటరీ..
ఈ ఫోన్‌లో 8,000mAh భారీ బ్యాటరీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 1,500 ఛార్జింగ్ సైకిళ్ల తర్వాత కూడా బ్యాటరీ హెల్త్ 80 శాతానికి పైగా ఉండేలా రూపొందించినట్లు వివో చెబుతోంది. వెనుక 50MP f/1.8 ప్రధాన కెమెరా, ముందు 8MP f/2.05 కెమెరా ఇచ్చారు. IP68 + IP69 రేటింగ్‌తో దుమ్ము, నీటి నుంచి రక్షణ లభిస్తుంది.
బేబీస్ బ్రీత్, క్లియర్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. చైనాలో 6GB + 128GB ధర 1,699 యువాన్లు (సుమారు రూ.24,325), 6GB + 256GB ధర 1,999 యువాన్లు (సుమారు రూ.28,660). ప్రస్తుతం 256GB వేరియంట్ విక్రయానికి వచ్చింది. 128GB మోడల్ త్వరలో అందుబాటులోకి రానుంది. భారత్‌లో విడుదలపై అధికారిక సమాచారం లేదు.
