AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.1,100కే 32GB స్టోరేజ్‌తో కొత్త ఫీచర్ ఫోన్.. మరో సర్‌ప్రైజ్ ఏంటంటే?

తక్కువ ధరలో సాధారణ అవసరాలకు ఉపయోగపడే ఫీచర్ ఫోన్లకు ఇప్పటికీ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో HMD మరో కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. HMD 106 Pure పేరుతో వచ్చిన ఈ ఫోన్ పాకిస్థాన్‌లోని ఓ రిటైల్ స్టోర్‌లో ఎలాంటి ముందస్తు అధికారిక ప్రకటన లేకుండానే కనిపించింది. తక్కువ ధరలో 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి.

రూ.1,100కే  32GB స్టోరేజ్‌తో కొత్త ఫీచర్ ఫోన్.. మరో సర్‌ప్రైజ్ ఏంటంటే?
Hmd 106 Pure
Nikhil
|

Updated on: Oct 03, 2026 | 6:40 AM

Share

ప్రస్తుతం ఈ ఫోన్ పాకిస్థాన్‌లో PKR 3,250 ధరతో లిస్ట్ అయింది. భారత కరెన్సీలో దీని ధర సుమారు రూ.1,100 వరకు ఉంటుంది. బ్లూ రంగులో కనిపిస్తున్న ఈ ఫీచర్ ఫోన్‌లో సాధారణ కాల్స్, రేడియో, మ్యూజిక్ వంటి అవసరాలతో పాటు స్టోరేజ్ పెంచుకునే సదుపాయం కూడా ఉంది. భారత్‌లో విడుదల ఎప్పుడు జరుగుతుందనే సమాచారం మాత్రం ఇంకా లేదు.

1.8 అంగుళాల డిస్‌ప్లే..

ఈ ఫోన్‌లో 1.8 అంగుళాల QVGA డిస్‌ప్లేను అందించారు. ఇది 120×160 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. S30+ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ మొబైల్‌లో Unisoc 6531E చిప్‌సెట్‌ను ఉపయోగించారు. వెనుక భాగంలో కెమెరా కూడా ఉంది. ఇది 320×240 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో ఫొటోలు తీసుకోగలదు. స్టోరేజ్ విషయానికి వస్తే 32GB వరకు సామర్థ్యం ఉన్నట్లు రిటైల్ లిస్టింగ్‌లో పేర్కొన్నారు. మైక్రోఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను మరింత పెంచుకోవచ్చు. తక్కువ ధర ఫోన్ అయినప్పటికీ ఈ సదుపాయం ఉండటం ప్రత్యేకతగా చెప్పొచ్చు.

పాత ఛార్జింగ్ పోర్ట్‌కు గుడ్‌బై

HMD 106 Pureలో 1,000mAh బ్యాటరీ ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా USB Type-C పోర్ట్‌ను అందించారు. సాధారణంగా బడ్జెట్ ఫీచర్ ఫోన్లలో కనిపించే పాత Micro-USBకు బదులుగా USB-C ఇవ్వడం వల్ల ఛార్జింగ్ విషయంలో సౌకర్యంగా ఉంటుంది. మ్యూజిక్ వినేందుకు 3.5mm హెడ్‌ఫోన్ జాక్, వార్తలు, వినోదం కోసం FM రేడియో సపోర్ట్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్ పాకిస్థాన్‌లోని రిటైల్ స్టోర్‌లో మాత్రమే కనిపించింది. HMD అధికారికంగా లాంచ్ వివరాలు ప్రకటించాల్సి ఉంది. భారత మార్కెట్లో లభ్యతపై కూడా ప్రస్తుతానికి స్పష్టత లేదు.

Follow Us