AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో కో-పైలట్ గుర్తింపు.. వెలుగులోకి సంచలన విషయాలు!

దుబాయ్-టెల్ అవీవ్ ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో కెప్టెన్‌పై దాడి చేసిన కో-పైలట్ ఒమన్‌కు చెందిన హమామ్ అల్-హమామిగా గుర్తించారు. ఫ్లైదుబాయ్ విమానం గాల్లో ఉండగా కెప్టెన్‌ను గాయపరిచి, అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. గతంలో తీవ్రవాద వెబ్‌సైట్లు సందర్శించిన ఆరోపణలున్న హమామి నేపథ్యంపై ప్రస్తుతం యూఏఈ, సౌదీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో కో-పైలట్ గుర్తింపు.. వెలుగులోకి సంచలన విషయాలు!
Flydubai Co Pilot Hamam Al Hamami Omani
Balaraju Goud
|

Updated on: Oct 03, 2026 | 7:04 AM

Share

దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కెప్టెన్ స్మిత్ మచార్‌పై దాడి చేసిన కో-పైలట్‌ను గుర్తించినట్లు అరబ్ మీడియా వెల్లడించింది. అల్ అరబియా విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ.. ఒమన్‌కు చెందిన కో-పైలట్‌ను హమామ్ అల్-హమామిగా గుర్తించినట్లు పేర్కొంది. అయితే ఈ వివరాలను అధికారిక దర్యాప్తు సంస్థలు పూర్తిగా ధృవీకరించాల్సి ఉంది.

సెప్టెంబర్ 30న జరిగిన ఈ ఘటనలో ఫ్లైదుబాయ్ FZ1073 విమానం గాల్లో ఉండగానే కెప్టెన్‌పై కో-పైలట్ దాడి చేసినట్లు అధికారులు వెల్లడించారు. దాడిలో కెప్టెన్ స్మిత్ మచార్ తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో విమానం భారీగా కిందకు దిగడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. గాయాలతోనే కెప్టెన్ కాక్‌పిట్ తలుపు తెరవడంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలో ఉన్న 174 మంది సురక్షితంగా బయటపడ్డారు.

ఇదిలా ఉండగా, హమామ్ అల్-హమామి గతంలో తీవ్రవాద వెబ్‌సైట్లను సందర్శించేవాడని, ఈ కారణంగా 2024-25లో ఉద్యోగం నుంచి తొలగించారని కొన్ని అరబ్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అనంతరం తగిన నేపథ్య పరిశీలన లేకుండానే ఫ్లైదుబాయ్‌లో నియమించారనే ఆరోపణలు కూడా వెలువడ్డాయి. అతని తల్లి సిరియా సంతతికి చెందినవారనే సమాచారం ప్రచారంలో ఉంది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడలేదు. ప్రస్తుతం యూఏఈ, సౌదీ అరేబియా అధికారులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఫ్లైట్ డేటా, కాక్‌పిట్ రికార్డర్లు, ప్రయాణికుల వాంగ్మూలాలు, వీడియో ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us